వారంలో వెయ్యి కోట్లు కొల్లగొడుతుందట

వారంలో వెయ్యి కోట్లు కొల్లగొడుతుందట

నెల కిందట వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది ‘ఎవెంజర్స్: ది ఇన్ఫినిటీ వార్’. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రతి చోటా ఈ చిత్రం సంచలన వసూళ్లు రాబట్టింది. ఇండియాలో ఓపెనింగ్ వీకెండ్లోనే వంద కోట్లు కొల్లగొట్టి ఆశ్చర్యపరిచింది. ఫుల్ రన్లో రూ.300 కోట్ల మార్కుకు చేరువగా రావడమూ అనూహ్యమే. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.8 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. ప్రపంచ సినీ చరిత్రలోనే హైయెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచిందీ చిత్రం.

 ఇప్పుడు దాన్ని మించే సినిమా ఒకటి రాబోతోంది. వచ్చే వారాంతంలో రాబోయే ‘జురాసిక్ వరల్డ్: ది ఫాలెన్ కింగ్ డమ్’పై అంచనాలు మామూలుగా లేవు. జురాసిక్ పార్క్ సిరీస్‌లో ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నీ కళ్లు చెదిరే వసూళ్లు సాధించాయి. వాటన్నింటినీ కొత్త సినిమా అధిగమించడం ఖాయం. దీనిపై హైప్ మామూలుగా లేదు.

ఈ చిత్రం గత బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు ట్రేడ్ పండిట్లు. కేవలం ఓపెనింగ్ వీకెండ్లోనే ఈ చిత్రం రూ.1000 కోట్ల వసూళ్లు రాబడుతుందన్నది అంచనా. ఫుల్ రన్లో పది వేల కోట్ల మార్కును కూడా టచ్ చేయొచ్చని అంటున్నారు. ఇండియాలో కూడా ఈ చిత్రం భారీ అంచనాలతో పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఇప్పటిదాకా ఏ హాలీవుడ్ సినిమా లేని స్థాయిలో 2600 థియేటర్లలో ఒక బాలీవుడ్ స్టార్ సినిమాకు సమానంగా దీన్ని రిలీజ్ చేయబోతున్నారట.

ఇంగ్లిష్‌తో పాటు హిందీ.. తెలుగు.. తమిళ భాషల్లో ‘జురాసిక్ వరల్డ్’ విడుదల కాబోతోంది. వచ్చే వారం ‘కాలా’ మినహాయిస్తే ఇండియాలో పెద్ద రిలీజ్ ఏమీ లేదు. దానిపైనా అంచనాలు మరీ ఎక్కువేం లేవు. కాబట్టి ‘జురాసిక్ వరల్డ్’ బాక్సాఫీస్‌ను షేర్ చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు