డబ్బింగ్ సినిమాకే పట్టం దక్కిందా?

డబ్బింగ్ సినిమాకే పట్టం దక్కిందా?

టాలీవుడ్ లో మహానటి తర్వాత.. జనాలను ఆకట్టుకునే మూవీ రాలేదు. ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నీ పేలిపోగా.. ఈ వారం వచ్చిన మూడు సినిమాలవైపు జనాలు ఆసక్తిగానే చూశారు. పైగా సమ్మర్ హాలిడేస్ కూడా చివరకు వచ్చేయడంతో.. ఏ సినిమా నెగ్గుతుందో.. చివరి వారాన్ని ఏ చిత్రం క్యాష్ చేసుకుంటుందో అని గమనించడం స్టార్ట్ చేశారు.

నాగార్జున-రాంగోపాల్ వర్మ సినిమాపై అంచనాలు లేకపోయినా.. ఇన్నేళ్ల తర్వాత నాగ్ ఛాన్స్ ఇచ్చాడంటే.. ఏదో మ్యాటర్ ఉండి ఉంటుందని.. అంతో ఇంతో ఆశపడ్డారు జనాలు. వర్మ రీసెంట్ ఫిలిమ్స్ లో బెటర్ అని అనిపించుకున్నా.. మూవీలో మ్యాటర్ అయితే లేదనే సంగతి తేలిపోయింది. రివ్యూలు.. రేటింగులే కాదు.. మౌత్ టాక్ కూడా దారుణంగానే ఉంది. ఇక రాజ్ తరుణ్ రాజుగాడు నవ్వించే ఛాన్సులు ఉన్నాయని అంతా ఆశించారు. కొత్త దర్శకురాలు కొత్త తరహా మెరుపులను చూపిస్తుందని అంచనా వేయగా.. ఇవి కూడా ఒట్టి ఊహలుగానే నిలిచిపోయాయి.

ఇక డబ్బింగ్ సినిమాగా వచ్చిన అభిమన్యుడు మాత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. సైబర్ క్రైమ్ బేస్డ్ గా తీసిన సినిమా కావడం.. కొత్త తరహా సన్నివేశాలు.. టెక్నాలజీ.. అన్నిటికీ మించి విశాల్- అర్జున్ లు హీరో-విలన్ గా మెరుపులు మెరిపించారు. ఇక సమంత అందాలు ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. మొత్తం మీద డబ్బింగ్ సినిమానే ఈ వారానికి లీడర్ గా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. అదే మన స్ర్టయిట్ తెలుగు సినిమాల్లో ఒక్కటి కూడా పడుకోకుండా ఉండి ఉంటే.. కాస్త పోటాపోటీ వాతావరణం ఉండేది. ఇలా తమిళోళ్ళ సినిమా జండా ఎగరేసేదే కాదు అనేది మన విశ్లేషకుల ఫీలింగ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు