ఓసారి రివ్యూ చేసుకో రాజా

ఓసారి  రివ్యూ చేసుకో రాజా

బెంగాల్ టైగర్ తర్వాత బ్రేక్ తీసుకుని.. రాజా ది గ్రేట్ తో తన సత్తా చాటిన రవితేజ.. ఆ జోరును కంటిన్యూ చేయడంలో కంప్లీట్ గా ఫెయిల్ అవుతున్నాడు. ఫిబ్రవరి ప్రారంభంలో వచ్చిన టచ్ చేసి చూడు మూవీ.. సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకుని మరీ వచ్చినా.. ఏ మాత్రం ఆసక్తి కలిగించలేకపోయింది. రవితేజ కెరీర్ లోనే మచ్చగా మిగిలే రిజల్ట్ ను అందించింది.

అయినా సరే.. గత నెలలో వచ్చిన నేల టికెట్ కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయంటే.. అందుకు కారమం.. మాస్ లో మాస్ మహరాజ్ కు ఉన్న భీకరమైన ఇమేజ్. కానీ ఈ సినిమా కూడా జనాలను ఏ మాత్రం ఎంగేజ్ చేయలేకపోయింది. ఇలా వరుస సినిమాలు దెబ్బ కొట్టడం వెనుక కారణాలను వెతుక్కోవాల్సిన అవసరం జనాలకు లేదు కానీ.. రవితేజకు అవసరంతో పాటు బాధ్యత కూడా ఉంటుంది. తనపై ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాలను నిలబెట్టాల్సిన డ్యూటీ ఆ హీరోదే.

ఇప్పుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందే అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రానికి 70 రోజుల పాటు యూఎస్ షెడ్యూల్ కోసం వెళుతున్నారు టీం. టచ్ చేసి చూడు ఎందుకు దెబ్బ కొట్టిందో రివ్యూ చేసుకోకుండానే.. నేల టికెట్ ను చుట్టేశాడు హీరో. ఇప్పుడు ఆ నేల టికెట్ దెబ్బపడిన వెంటనే.. అసలే ఫ్లాపుల్లో ఉన్న వైట్ల సినిమాను చకచకా చేసేందుకు సిద్ధపడ్డాడు. అసలు కంటెంట్ లో ఏముందో.. జనాలను ఏ మాత్రం ఆకట్టుకుంటుందో.. ఓసారి సిన్సియర్ గా రివ్యూ చేసుకుని మరీ సినిమా చేస్తే బెటర్ అంటూ.. రవితేజకు చాలామంది సలహాలు ఇచ్చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు