ఇండస్ట్రీకి మరో సూపర్ స్టార్ దొరికినట్లేనా?

ఇండస్ట్రీకి మరో సూపర్ స్టార్ దొరికినట్లేనా?

హైద్రాబాదీ భామ అయిన అదితి రావు హైదరి.. బాలీవుడ్ లో చాలాకాలం నుంచే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈమె టాలీవుడ్ ఎంట్రీ గురించి రకరకాల కథనాలు చాలా వచ్చినా.. ఇప్పటికి ఇది సాధ్యమైంది. సమ్మోహనం అంటూ ఇంద్రగంటి సినిమాతో జనాలను మోహంలో ముంచేందుకు వస్తోంది అదితి.

జూలై 15న సమ్మోహనం చిత్రాన్ని విడుదల చేయనుండగా.. ఈచిత్ర ప్రచారం కోసం అదితి రావ్ బాగానే కష్టపడుతోంది. తన గ్లామర్ మెరుపులకు.. బాలీవుడ్ స్టైల్ ను రంగరించి మరీ చూపిస్తూ ప్రచారం చేస్తున్న వైనం ఆకట్టుకుంటోంది. చిన్నపాటి డ్రెస్సులు వేసుకుంటూ.. సోయగాలను ప్రదర్శిస్తూ.. ఈ సుందరి చేస్తున్న ఎక్స్ పోజింగ్ కు బాగానే గుర్తింపు లభిస్తోంది. అయితే.. ఈ గ్లామరంతా చూసి.. టాలీవుడ్ కు మరో సూపర్ స్టార్ వచ్చేస్తోందని పలువురు చెబుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో హఠాత్తుగా క్రేజ్ సంపాదించుకున్న భామలు చాలామందే కనిపిస్తున్నారు.

అను ఎమ్మానుయేల్.. కీర్తి సురేష్‌.. పూజా హెగ్డే.. కియారా అద్వాని.. వీరితో పాటు మరికొందరు కూడా ఒక్క సినిమాకే క్రేజీ బ్యూటీగా మారిపోయి అవకాశాలను అందుకున్నారు. ఇప్పుడు సమ్మోహనం సినిమాతో అదితి రావు కూడా ఓవర్ నైట్ పాపులర్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. గతంలో చెలియా మూవీతో ఓసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది కానీ.. ఆమెకు ఆ చిత్రం అంతగా ఉపయోగపడలేదు. మరి సమ్మోహనం ఎలాంటి రిజల్ట్ ను ఇవ్వనుందో చూడాలి. బాలీవుడ్ లో ఎంత ప్రయత్నించినా దక్కని స్టార్ డంను.. తెలుగులో అయినా దక్కించుకుంటుందో లేదో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు