పక్కనోళ్లతో తరుణ్ కి ప్రాబ్లెమ్స్

పక్కనోళ్లతో తరుణ్ కి ప్రాబ్లెమ్స్

ఇప్పుడున్న యంగ్ హీరోల్లో.. మొదటగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కుర్రాడు రాజ్ తరుణ్. కానీ ఉయ్యాలా జంపాలా.. కుమారి21ఎఫ్ చిత్రాలు సక్సెస్ అయినపుడు ఏ స్టేజ్ లో ఉన్నాడో.. ఇప్పటికీ అక్కడే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే.. రెమ్యూనరేషన్ పరంగా పెరిగాడేమో కానీ.. సినిమాల రేంజ్ మాత్రం ఇంకా అక్కడే ఉందనే టాక్ ఉంది.

అయితే.. రాజ్ తరుణ్ మంచి సబ్జెక్టులు మిస్ అయిపోతుండడమే.. ఇలా కుర్రాడి కెరీర్ స్తంభించిపోవడానికి కారణం అంటున్నారు. పెద్ద సినిమాలు.. మంచి సినిమాలు పడడం లేదంటే.. అందుకు ఎంచుకోవడంలో ఉన్న లోపమే అనే వాదనలో కొంత వాస్తవం ఉన్నట్లే. అయితే.. ఇతడు కథలు సెలెక్ట్ చేసుకుంటున్న తీరుపై కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరైనా సబ్జెక్ట్ చెప్పడానికి వస్తే వారిని సినాప్సిస్ అడుగుతున్నాడట ఈ కుర్ర హీరో. అంటే రెండున్నర గంటల కథను.. మూడు నాలుగు పేరాల్లో ఒక్క పేజీలో చదివేస్తాడన్న మాట.

ఇలా ఒక్క పేపర్ సినాప్సిస్ ను చదివిన రాజ్ తరుణ్ సన్నిహితులు.. పక్కనే ఉండేవాళ్లు.. ఇందులో పసలేదంటూ పక్కన పెట్టేస్తున్నారట. నిజానికి ఏ సినిమాకు అయినా కథ కంటే కథనం చాలా ముఖ్యం. కానీ అక్కడి వరకూ సబ్జెక్టులు వినడమే జరగడం లేదట. రాజ్ తరుణ్ రిజెక్ట్ చేసిన పలు సబ్జెక్టులతో నాని.. శర్వానంద్ బ్లాక్ బస్టర్స్ కూడా కొట్టేశారనే టాక్ ఉంది. నాని చేసిన నేను లోకల్.. శర్వానంద్ ప్రస్తుతం చేస్తున్న ఓ మూవీ కూడా మొదట రాజ్ తరుణ్ దగ్గరకే వచ్చాయనే టాక్ ఉంది. మరి ఇలాగే కంటిన్యూ అయితే.. కెరీర్ కథ కష్టంగానే ఉండొచ్చని అంటున్నారు. ఇప్పుడీ కుర్ర హీరో తన పద్ధతైనా మార్చాలి.. లేకపోతే పక్కనే ఉండి సరైన గైడెన్స్ ఇవ్వలేకపోతున్న టీం అయినా మార్చాలనే సజెషన్స్ వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English