ఈవిడ సై అంటే.. ఆయన నై అంటున్నాడట

ఈవిడ సై అంటే.. ఆయన నై అంటున్నాడట

అజ్ఞాతవాసి మూవీ తర్వాత మళ్లీ స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ పై వర్క్ చేసి మరీ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం సుదీర్ఘ కాలం వెయిట్ చేసి.. సిక్స్ ప్యాక్ సిద్ధం చేసుకుని మరీ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం ఇప్పటికే ఫస్ట్ లుక్ ద్వారా చూపించారు కూడా.

త్రివిక్రమ్ -ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా.. పూజా హెగ్డే కనిపించనుండగా.. సెకండ్ హీరోయిన్ పాత్రకు తెలుగమ్మాయి ఈషా రెబ్బాను ఫైనల్ చేసుకున్నారు. మొదట ఈమెను అడిగినప్పుడు.. గ్లామర్ అయితే చేయనని ముందే చెప్పిందట. కానీ ఈమెను తీసుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్న త్రివిక్రమ్.. అత్తారింటికి దారేది చిత్రంలో ప్రణీత పాత్ర తరహాలో హోమ్లీ క్యారెక్టర్ ను డిజైన్ చేశాడట. హోమ్లీ రోల్ అయితే కనిపిస్తానన్న ఈషా రెబ్బా.. ఇప్పుడు మాట మార్చేసినట్లుగా చెబుతున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో అందాలు చిందుస్తున్న ఈషా.. సినిమాలో కూడా నేను గ్లామర్ ఒలికిస్తా అంటోందట. అందుకోసం ఈమధ్యన పూల్ ఫోటోలు.. ఫోటో షూట్లు అంటూ ట్విట్టర్లో నానా రచ్చా చేస్తోంది.

ఇలా అందాల భామే ఎక్స్ పోజింగ్ చేస్తానని రివర్స్ లో అడుగుతున్నా.. త్రివిక్రమ్ మాత్రం ససేమిరా అంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే క్యారెక్టరైజేషన్ తో పాటు.. స్క్రిప్ట్ కూడా లాక్ చేసేసుకున్న మాటల మాంత్రికుడు.. హాటెస్ట్ లుక్ ఇస్తానంటున్నా సరే.. తెలుగుమ్మాయి కోరికను ఏమాత్రం మన్నించడం లేదని టాక్. ఈవిడ సై అన్నాకూడా.. ఆయన నై నై అంటున్నాడనమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు