రాజమౌళికి పోటీ వస్తున్న ప్రభాస్

రాజమౌళికి పోటీ వస్తున్న ప్రభాస్

ప్రభాస్ అండ్ రాజమౌళి.. నాలుగేళ్లకు మించిన సమయాన్ని కలిసి కంటిన్యూ చేశారు. బాహుబలి లాంటి అద్భుతాన్ని సాకారం చేశారు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా.. దేశంలో ఎన్నో రికార్డులను నమోదు చేసుకోగా.. ఇప్పుడు ఎవరి బాటలో వారు సినిమాలు చేసుకుంటున్నారు.

సాహో.. అంటూ సుజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. మొదట చాలా నెమ్మదిగా పిక్చరైజేషన్ జరగగా.. రీసెంట్ గా అబుదాబి షెడ్యూల్ ను పూర్తి చేయడంతో..ఈ సినిమా షూటింగ్ ఇప్పుడే ఓ కొలిక్కి చేరుకుంది. ఇప్పటివరకూ వచ్చిన అప్ డేట్స్.. మొదటగా విడుదల చేసిన టీజర్.. హైలెవెల్ యాక్షన్ సీక్వెన్స్ లు.. వీటన్నిటినీ బేస్ చేసుకుంటే.. ఇదో గ్యాంగ్ స్టర్ బేస్డ్ మూవీ అనే సంగతి అర్ధం అవుతూనే ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఇప్పుడు రాజమౌళి కూడా ఇలాంటి సబ్జెక్టునే ఎంచుకున్నాడని అంటున్నారు.

#RRR అంటూ రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్ మూవీ.. గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో సాగుతుందట. ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ గాను.. రామ్ చరణ్ పోలీస్ గాను కనిపిస్తారని.. వాళ్లిద్దరూ అన్నాదమ్ముల పాత్రలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. అటు ప్రభాస్.. ఇటు రాజమౌళి.. ఇలా ఇద్దరూ బాహుబలి తర్వాత తమ సత్తాను ప్రూవ్ చేసుకునేందుకు గ్యాంగ్ స్టర్ థీమ్ ను ఎంచుకోవడం మాత్రం ఆసక్తి కలిగించే విషయమే. మరి ఒకే తరహా కథతో వస్తున్న వీరిద్దరిలో.. ఎవరు పెద్ద హిట్టు కొడతారంటారూ?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు