చిరుతో అమ్మడి రోల్ పెరిగిందటగా

చిరుతో అమ్మడి రోల్ పెరిగిందటగా

సైరా నరసింహా రెడ్డి అంటూ మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాను ఆరేడు నెలలుగా షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ షూటింగ్ అంత వేగంగా సాగలేదు కానీ.. ఇకపై మాత్రం ఫుల్ స్వింగ్ లో షూట్ చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అయితే.. రీసెంట్ గా జరిగిన ఓ డెవలప్మెంట్ మాత్రం బాగా ఆసక్తిని కలిగిస్తోంది.

సైరా నరసింహారెడ్డి చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమన్నా లుక్ టెస్ట్ కూడా నిర్వహించారట. తమ్మూకి ఆఫర్ చేసిన పాత్రకు.. ఆమె ఆహార్యానికి అద్భుతంగా కుదిరిందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇంప్రెస్ అయిపోయిన టీం.. ఆమె పాత్రను మరింతగా పొడిగించాలని డిసైడ్ అయ్యారట. ఈ చిత్రంలో దేవదాసీ టైపు రోల్.. డ్యాన్సర్ గా తమన్నా కనిపించనుందని తెలుస్తోంది. ఒరిజినల్ గా సూపర్బ్ గా డ్యాన్స్ చేసే మిల్కీ.. తనకు ఆఫర్ చేసిన రోల్ లో బాగా సెట్ అయిపోయిందట.

దీంతో తమన్నాకు ఆఫర్ చేసిన పాత్రను మరింత సేపు సినిమాలో చూపించేందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతిపాదించగా.. చిరంజీవి కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. మొదటగా అన్నకున్న ప్రకారం అయితే.. మిల్కీ 10 నిమిషాల పాటు మాతర్మే కనిపించాలట కానీ.. ఇప్పుడు మరో నిమిషాల పాటు ఆమె రోల్ ను పెంచడంతో.. మొత్తంగా అరగంట స్క్రీన్ టైం ఆమె లభిస్తుందని చెబుతున్నారు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English