ఆ గ్యాంగ్ స్టర్ కథేనా #RRR?

ఆ గ్యాంగ్ స్టర్ కథేనా #RRR?

#RRR.. ఈ సినిమా గురించి ఇప్పుడు టాలీవుడ్ మాత్రమే కాదు.. మొత్తం దేశం అంతా ఎదురుచూస్తోంది. రాజమౌళి చూపించబోయే అద్భుతాల కోసం ఆత్రంగా చూస్తోంది. క్రేజీ మల్టీస్టారర్ గా రూపొందే ఈ సినిమాలో ఎన్టీఆర్- రామ్ చరణ్ పాత్రలతో పాటు.. ఈ సినిమా కథ ఏంటనే అంశంపై చాలానే డిస్కషన్స్ జరుగుతున్నాయి.

#RRR కథపై ఇప్పటికే చాలా రకాల మాటలు వినిపించగా.. ఇప్పుడో కొత్త ప్రచారం కాసింత వాస్తవానికి దగ్గరగా ఉందని అంటున్నారు. ఈ సినిమా కథ కాదు కానీ.. కొన్ని కీలక సన్నివేశాలను మాత్రం అమెరికన్ గ్యాంగ్ స్టర్ అనే హాలీవుడ్ మూవీ నుంచి ఇన్ స్పిరేషన్ తీసుకున్నారట. అంటే.. ఆ సీన్స్ ను చూసిన స్ఫూర్తితో కథ ప్రిపేర్ చేసుకున్నారని.. అమెరికన్ గ్యాంగ్ స్టర్ కు.. ఈ చిత్రానికి దగ్గర పోలికలు పెద్దగా ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో హీరోలు ఇద్దరూ అన్నాదమ్ములుగా కనిపిస్తారనే టాక్ మాత్రం నిజమే అంటున్నారు. కథ ప్రకారం రామ్ చరణ్ పోలీస్ గా కనిపించనుండగా.. అన్నయ్య పాత్రలో నటించనున్న ఎన్టీఆర్.. ఓ గ్యాంగ్ స్టర్ గా తన విశ్వరూపం చూపించనున్నాడట. ఫ్యామిలీలో జరిగే విబేధాల కారణంగా గ్యాంగ్ స్టర్ గా మారగా.. అతడితో పోటీ పడే తమ్ముడి రోల్ లో చెర్రీ యాక్ట్ చేయనున్నాడని అంటున్నారు. మొత్తం మీద.. ఇది గ్యాంగ్ స్టర్స్ మీద నడిచే సబ్జెక్ట్ అనేది మాత్రం ఖాయమేనట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు