అమ్మా ఉపాసనా.. మీ ఆయనకి చెప్పమ్మా..

అమ్మా ఉపాసనా.. మీ ఆయనకి చెప్పమ్మా..

ఫిలిం ఇండస్ట్రీ అంటే గతంలో మాదిరిగా ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిగా ఉండడం లేదు. టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల ఫ్రెండ్ షిప్ కనిపిస్తోంది. ఎన్టీఆర్.. చరణ్ లాంటి స్టార్లు.. ఇతర హీరోల సినిమాలను ప్రోత్సహిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది.

రీసెంట్ గా మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్.. ఎన్టీఆర్ కు ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరితే.. దాన్ని ఇతర హీరోలతో పాటు చెర్రీకి కూడా పాస్ ఆన్ చేశాడు యంగ్ టైగర్. అయితే.. ఆయా హీరోల మాదిరిగా రామ్ చరణ్ ట్విట్టర్ లో లేడు. దీంతో ట్విట్టర్ లో ఉన్న ఉపాసనను ట్యాగ్ చేసి.. తను ఛాలెంజ్ విసిరిన సంగతి మీ ఆయనకు చెప్పమంటూ పోస్ట్ పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. చరణ్ కు మెసేజ్ ను అందించమంటూ అతని వైఫ్ కు చెప్పాడంటే.. ఈ రెండు కుటుంబాల మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉందో అర్ధమవుతుంది. నిజానికి #RRR ప్రాజెక్టు అనుకున్న దగ్గరి నుంచి చరణ్-ఎన్టీఆర్ ల మధ్య సఖ్యత పెరిగింది.

అంతకు వీరి మధ్య గొడవలున్నాయని దీని అర్ధం కాదు కానీ.. ఆ తర్వాత మాత్రం బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. ఇలా ఫ్రెండ్లీగా ఉండడం ఆన్ స్క్రీన్ పై రిఫ్లెక్ట్ అవుతుందంటూ రాజమౌళి ఇచ్చిన సలహా.. చెర్రీ-యంగ్ టైగర్ లను.. వారి ఫ్యామిలీస్ ను దగ్గర చేసింది. సినిమా కోసం మొదలైన ఫ్రెండ్ షిప్.. రియల్ లైఫ్ లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయే వరకూ వచ్చేసింది. స్టార్ హీరోల మధ్య ఇంత థిక్ ఫ్రెండ్ షిప్ ను చూడడం.. టాలీవుడ్ లో ఇదేనేమో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు