విక్రమ్‌కు అలాంటి విలనా?

విక్రమ్‌కు అలాంటి విలనా?

ఇప్పుడైతే విక్రమ్ రేంజ్ పడిపోయింది కానీ.. దశాబ్దంన్నర వెనక్కి వెళ్తే అతను సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ హీరోల్లో ఒకడు. ‘సామి’.. ‘పితామగన్’.. ‘అపరిచితుడు’ లాంటి సినిమాలతో తిరుగులేని స్థాయిని అందుకున్నాడు. తెలుగులోనూ అతడికి అప్పుడు మాంచి ఫాలోయింగ్ ఉండేది. కానీ సినిమాల ఎంపికలో వేసిన తప్పటడుగులు విక్రమ్‌ను వెనక్కి లాగేశాయి. గత పుష్కర కాలంలో విక్రమ్ స్థాయికి తగ్గ సినిమానే రాలేదు.

ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘సామి స్క్వేర్’ మీదే ఉన్నాయి. విక్రమ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌‌గా నిలిచిన ‘సామి’కి కొనసాగింపుగా హరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. విక్రమ్ ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా ఈ చిత్రానికి మాంచి క్రేజ్ వచ్చింది. ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్ మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చింది.

‘సామి’ సినిమాలో విక్రమ్ పాత్రతో పాటు కోట శ్రీనివాసరావు పోషించిన విలన్ పాత్ర కూడా హైలైట్ అయింది. మరి రెండో భాగంలో ప్రతినాయకుడి పాత్రలో ఎవరు కనిపిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రతో బాబీ సింహా నటిస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ముందు చిన్న చిన్న సహాయ పాత్రలు చేసిన బాబీ.. ఆ తర్వాత ‘జిగర్ తండా’లో విలన్ పాత్రలో కనిపించి గొప్ప పేరు సంపాదించాడు. ఆ చిత్రానికి అతను జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. ఐతే బాబీ ఇప్పటిదాకా చేసినవన్నీ ప్రయోగాత్మక చిత్రాలే. కమర్షియల్ సినిమాల్లో అతను ఎప్పుడూ లీడ్ విలన్ పాత్రలో కనిపించలేదు. అతను విక్రమ్‌కు సూటయ్యే విలనేనా అన్న సందేహాలున్నాయి. నటుడిగా ఎంత మంచి పేరున్నప్పటికీ హరి స్టైల్ మాస్ విలన్ పాత్రకు అతనెంత మాత్రం సూటవుతాడో అంటున్నారు కోలీవుడ్ జనాలు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగులోనూ ఒకేసారి విడుదల కానుంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు