ఏం చూసి మహేష్‌ భామకు ఛాన్సిస్తున్నారు?

ఏం చూసి మహేష్‌ భామకు ఛాన్సిస్తున్నారు?

మహేష్ బాబు మూవీ 1నేనొక్కడినే చిత్రంతో తెరంగేట్రం చేసిన బ్యూటీ కృతి సనోన్. ఈ సినిమా ఫ్లాప్ అయినా.. ఆ తర్వాత వెంటనే హిందీలో అవకాశాలు రావడంతో ఎంచక్కా ముంబై ఎగిరిపోయింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ.. తెగ జోరు చూపించేస్తోంది కూడా.

ఇప్పుడీ భామ బాలీవుడ్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా పరిగణిస్తున్న కళంక్ లో కూడా చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత కరణ్ జోహార్.. ఆమెను ఇంట్రడ్యూస్ చేసి మరీ చెప్పుకొచ్చాడు. ఇవాల్టి నుంచి కళంక్ మూవీ షూటింగ్ లో ఆదిత్య రాయ్ కపూర్ కూడా పాల్గొంటున్నట్లు చెప్పిన కరణ్ జోహార్.. అదే వీడియోలో కృతి సనోన్ ని కూడా చూపించి.. ఈ చిన్నది కూడా కళంక్ లో నటిస్తోందని చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో మాధురీ దీక్షిత్.. సోనాక్షి సిన్హా.. ఆలియా భట్.. వరుణ్ ధావన్.. సంజయ్ దత్ తో సహా.. అనేక మంది బాలీవుడ్ తారలు నటించబోతున్నారు. ఇలాంటి మూవీలో ఇంకా అనేకమంది భారీ తారాగణం  కనిపించనుండగా.. ఇప్పుడు కృతి కూడా ఎంట్రీ ఇచ్చింది.

అయితే.. దిల్వాలే తర్వాత రాబ్టా.. బరేలీ కీ బర్ఫీ అంటూ చేసిన సినిమాలు ఏవీ జనాలను మెప్పించలేకపోయాయి. వరుసగా అన్ని సినిమాలు పరాజయం పాలవుతున్నా.. కృతి సనోన్ కి మాత్రం వరుస ఆఫర్లు భలే చిక్కుతున్నాయి. ఇప్పుడు కళంక్ తో పాటు అర్జున్ పటియాలా అనే బాలీవుడ్ మూవీ కూడా ఈ భామ చేతిలో ఉంది. అసలు ఏం చూసి ఈమెకు ఇన్నేసి ఛాన్సులు ఇస్తున్నారు అంటే.. బాలీవుడ్ లో కూడా ఎవ్వరికీ ఆన్సర్ తెలియదట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు