ముచ్చటగా మామా కోడలి క్లాష్‌

ముచ్చటగా మామా కోడలి క్లాష్‌

రేపు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నాగార్జున-రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో రూపొందిన మూవీ ఆఫీసర్.. విశాల్- సమంత జోడీగా నటించిన అభిమన్యుడు.. రాజ్ తరుణ్ సినిమా రాజుగాడు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో మొదటి రెండు సినిమాల క్లాష్‌ ఇప్పుడు చాలా ఆసక్తిని కలిగిస్తోంది.

ఇందుకు కారణం.. ఈ సినిమాల్లో మామా కోడళ్లు కనిపించనుండడమే. సామ్-చైతుల పెళ్లి జరిగిన కొన్ని రోజులకే రాజుగారి గది2 థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో మామాకోడళ్లు ఇద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా ఎలా ఆడిందన్న మ్యాటర్ పక్కన పెడితే.. ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నారు. ఆఫీసర్ గా నాగార్జున తన బీభత్స రూపాన్ని చూపించబోతున్నారు. అభిమన్యుడుగా వస్తున్న తమిళ్ మూవీ ఇరుంబుతిరాయ్ లో.. విశాల్ కు జోడీగా సమంత నటించింది. ఇప్పటికే తమిళ్ లో సక్సెస్ సాధించిన ఈ చిత్రంపై.. తెలుగులో కూడా విజయం సాధిస్తుందనే అంచనాలున్నాయి.

ఇప్పుడు మామా కోడళ్ల మధ్య పోటీ బాగా ఆసక్తిని కలిగిస్తోంది. రంగస్థలం.. మహానటి తర్వాత వస్తున్న సమంత మూవీ కావడంతో.. ఒకరకంగా కోడలికే అడ్వాంటేజ్ ఉంది. మరోవైపు వర్మ మీద ఏదో ఒక మూల కాసింత నమ్మకం ఉన్నా.. అలాంటివేమీ పెట్టుకోవద్దన్నట్లుగా ఉన్న ఆయన వాలకం కాసింత భయపెట్టేదే. మరి మామా కోడళ్లలో ఎవరిది పైచేయో.. మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు