సైరా లేట్.. చిరు డేరింగ్ డెసిషన్

సైరా లేట్.. చిరు డేరింగ్ డెసిషన్

ఇవాల్టి రోజుల్లో ఒకేసారి రెండు సినిమాల్లో యాక్ట్ చేస్తున్న పెద్ద హీరో పేరు ఒక్కటి చెప్పండి చూద్దాం. ఒక్కొక్కటి చొప్పున కంప్లీట్ చేయడానికే ఏడాదికి పైగా టీం తీసుకుంటున్నారు ఇప్పుడు హీరోలు. మీడియం రేంజ్ వరకు వదిలేస్తే.. ఆ పైన ఉన్న అందరి తీరు ఇలాగే ఉంది. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం.. మళ్లీ తన పాత రోజులను చూపించేందుకు రెడీ అయిపోతున్నారట.

ఖైదీ నంబర్ 150తో టాలీవుడ్ లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన చిరు.. అదే స్పీడుతో తన తర్వాతి చిత్రాన్ని ఖాయం చేసుకున్నారు. తన నెక్ట్స్ మూవీ మరింత గ్రాండ్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సబ్జెక్టును ఎంచుకోగా.. గతేడాది ఆగస్టులోనే ఈ చిత్రంపై ప్రకటన వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా నవంబర్ లో షూటింగ్ స్టార్ట్ అయింది కూడా. అయితే.. ఇప్పటికి 7-8 నెలలు గడిచిపోయినా.. ఇంకా 30 శాతం షూటింగ్ మాత్రమే చేశారని తెలుస్తోంది. ఈ సిట్యుయేషన్ చిరంజీవిని మరో డేరింగ్ డెసిషన్ వైపు నడిచేలా ప్రోత్సహించిందట.

కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు మెగాస్టార్ సిద్ధమయ్యారని ఇప్పటికే టాక్ ఉంది. అయితే.. ఇప్పటికే కొరటాల సబ్జెక్టు విషయంలో ఓ డెసిషన్ కు వచ్చాడని.. ఈ ఏడాది ఆగస్ట్ 22న చిరు బర్త్ డే సందర్భంగా.. అనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తోంది. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే.. ఓ నెల రోజులు గ్యాప్ ఇచ్చి షూటింగ్ కూడా మొదలుపెట్టేస్తారట. అటు సైరా చిత్రానికి సంబంధించిన పనులు చేస్తూనే.. మరోవైపు కొరటాల మూవీ షూటింగ్ లో పాల్గొంటారట చిరు. గెటప్ విషయంలో డిఫరెన్సులు వస్తాయనే సంగతి తెలిసినా.. సైరా పూర్తి కావడానికి చాలా సమయం పట్టేట్లుగా ఉండడంతో.. రెండు ప్రాజెక్టు వైపు అడుగులు వేస్తున్నారట మెగాస్టార్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు