8 ఏళ్ల తర్వాత బన్నీ కొట్టాడు!!

8 ఏళ్ల తర్వాత బన్నీ కొట్టాడు!!

అల్లు అర్జున్ సినిమాలంటే.. మినిమం ఏంటి.. మాగ్జిమం గ్యారంటీ అనే పరిస్థితి. ఫ్లాప్ అనే మాట ఎరుగకుండా 8 ఏళ్ల నుంచి సినిమాలు అందిస్తున్న హీరో మరొకరు ఎవరూ ఇండస్ట్రీలోనే లేరు. చివరగా 2010లో వరుడు మూవీతో ఫ్లాప్ కొట్టిన అల్లు అర్జున్.. మళ్లీ ఇప్పుడు 2018లో షాక్ తగిలింది.

నా పేరు సూర్య చిత్రం విడుదల అయి మూడు వారాలు పూర్తయేసరికే క్లోజింగ్ కు వచ్చేసింది. తొలి వారాంతం వరకూ ఓ మోస్తరు వసూళ్లు సాధించిన నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా.. వీకెండ్ ముగియగానే డ్రాప్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన మహానటి మరింతగా దెబ్బ తీసింది. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 77.6 కోట్లకు విక్రయించారు. ప్రింట్స్ ఖర్చులు వగైరాలను కలుపుకుంటే.. కనీసం 80 కోట్లు వసూలు చేస్తేనే హిట్ అనిపించుకునే పరిస్థితి. కానీ సూర్య క్లోజింగ్ కలెక్షన్స్ 50.14 కోట్లు మాత్రమే.

ఇందులో తొలి మూడు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వచ్చిన సంగతి గుర్తుంచుకోవాలి. ఓ రకంగా చూస్తే బన్నీకి మరచిపోలేని ఫలితాన్ని అందించింది వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన చిత్రం. కంటెంట్ పరంగా బాగానే ఉందని చెప్పినా.. అది ఆడియన్స్ ను థియేటర్లకు రాబట్టేందుకు సరిపోలేదు. అందుకే సూర్య కథ 50 కోట్ల దగ్గరే ఆగిపోగా.. 35 శాతం మేర నష్టాలు డిస్ట్రిబ్యూటర్లలకు మిగిలాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు