క్వీన్ రీమేక్ కదిలింది.. ఇదిగో సాక్ష్యం

క్వీన్ రీమేక్ కదిలింది.. ఇదిగో సాక్ష్యం

బాలీవుడ్లో నాలుగేళ్ల కిందట విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా ‘క్వీన్’. ఇండియాలో వచ్చిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఇదొక మైలురాయి అని చెప్పొచ్చు. అప్పట్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం రేపిందీ సినిమా. ఈ చిత్రాన్ని దక్షిణాదిన నాలుగు భాషల్లోనూ రీమేక్ చేయడానికి సంకల్పించాడు తమిళ నిర్మాత త్యాగరాజన్. కానీ సరైన కాస్ట్ అండ్ క్రూ కుదరక సినిమా ఆలస్యమైంది.

చివరికి గత ఏడాది కన్నడ.. తెలుగు.. తమిళ.. మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. తెలుగులో తమన్నా కథానాయికగా నీలకంఠ దర్శకత్వంలో ‘క్వీన్’ రీమేక్ మొదలైంది. కానీ ఏం జరిగిందో ఏమో.. కొన్ని రోజులకే నీలకంఠ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. తర్వాత ఈ సినిమా గురించి అప్ డేట్ లేదు.

ఐతే ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మకు తెలుగు ‘క్వీన్’ బాధ్యతలు అప్పగించినట్లు ఇటీవలే వార్తలొచ్చాయి. ఇది నిజమే అని తేల్చే ఫొటో ఒకటి బయటికి వచ్చింది. నిన్న ప్రశాంత్ వర్మ పుట్టిన రోజు తమన్నాతో కలిసి జరుపుకోవడం విశేషం.  ‘క్వీన్’ రీమేక్ సెట్లోనే ఈ వేడుక జరిగింది. అంటే ఆల్రెడీ ప్రశాంత్ చిత్రీకరణ కూడా మొదలుపెట్టేశాడన్నమాట.

‘క్వీన్’ కన్నడ.. తమిళ వెర్షన్లు కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో కాజల్ అగర్వాల్.. కన్నడలో పారుల్ యాదవ్ కథానాయికలుగా నటిస్తున్నారు. మలయాళంలో మాంజిమా మోహన్ కథానాయికగా రేవతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. వేర్వేరు భాషల్లో వేర్వేరు తారలు నటిస్తుండటంతో కథానాయిక పాత్రలో ఎవరెలా చేస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. రిలీజ్ కూడా వేర్వేరు సమయాల్లోనే చేస్తారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు