అరవిందా సమేత.. రామజోగయ్య రోమాంచనాలు

అరవిందా సమేత.. రామజోగయ్య రోమాంచనాలు

కొన్ని పాటలు.. ఆరంభం నుంచే ఆకట్టుకుంటాయి. తెరపైకి వచ్చాక జనాలను మెప్పించడం సంగతి పక్కన పెడితే.. అసలు కొన్ని కాన్సెప్టులు ఆ పాటను రాసిన రచయితలనే కట్టిపడేస్తుంటాయి. దాని గురించి బైటకు చెప్పలేరు.. అలాగని ఇంకా విడుదల కాని సినిమా గురించి వివరాలు చెప్పేయలేరు.

కానీ తమ ఎక్సైట్ మెంట్ ను ఆపుకోలేక.. అంతో ఇంతో డీటైలింగ్ చెప్పేయాల్సి వస్తుంది. అలాంటి ఓ అద్భుతమైన పాటను రాశాననే నమ్మకంతో ఉన్నాడు పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ మూవీ అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి.. కొన్ని పాటలను ఈయనే రాస్తున్నాడు. త్రివిక్రమ్ చెప్పిన ఓ అద్భుతమైన సన్నివేశానికి.. ఓ ఎమోషనల్ పాటను రాసిన ఈయన.. ఆ గీతం అద్భుతంగా కుదిరిందనే నమ్మకంతో ఉన్నాడు. ఆ ఎమోషనల్ సాంగ్ ఇప్పటికీ ఆయన్ని వెంటాడుతూనే ఉందట.

అందుకే 'రోమాంచనాలు.. హృదయ ప్రకంపనాలు.. కన్నీటి జీరలు ఖచ్చితం' అంటూ తను రాసిన పాటకు తనే ఓ చిన్నపాటి టీజర్ ఇచ్చాడు రామజోగయ్య శాస్త్రి. రచయితనే ఈ పాట ఇంతగా వెంటాడితే.. దానికి త్రివిక్రమ్ మార్క్ డైరెక్షన్.. ఎన్టీఆర్ రేంజ్ యాక్టింగ్.. తమన్ మ్యూజిక్ కలగలిసిన తర్వాత.. జనాలను ఇంకెంతగా వెంటాడాలో కదా.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు