శ్వేతకి ముంబై నీళ్లు వంటబట్టాయ్

శ్వేతకి ముంబై నీళ్లు వంటబట్టాయ్

శ్వేతా బసు ప్రసాద్ తెలుగు ఆడియన్స్ కు బాగానే తెలుసు. కొత్త బంగారు లోకం అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కూడా పలు తెలుగు.. తమిళ చిత్రాలలో నటించింది. అయితే.. ఓ వివాదం కారణంగా హై్ద్రాబాద్ నుం వదిలి వెళ్లిపోయిన ఈ భామ.. మంబైలో బాగానే సెటిల్ అయింది.

బద్రీనాథ్ కి దుల్హనియా అంటూ గతేడాది వచ్చిన హిందీ మూవీలో కనిపించిన శ్వేతాబసు.. ఇప్పుడు మళ్లీ హైద్రాబాద్ వచ్చింది. ఈ సారి ప్రొఫెషనల్ గానే హైద్రాబాద్ కి వచ్చింది ఈ భామ. ప్రస్తుతం గ్యాంగ్ స్టార్స్ అంటూ రూపొందిన ఓ సిరీస్.. అమెజాన్ లో విడుదల కానుంది. 10 ఎపిసోడ్స్ సిరీస్ గా వస్తున్న గ్యాంగ్ స్టార్స్ ను.. జూన్ 1 నుంచి ప్రసారం చేయనుండగా.. ఈ సిరీస్ లో ఔత్సాహిక నిర్మాతగా కనిపించబోతోంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ కోసం ఇప్పుడు మళ్లీ హైద్రాబాద్ లో ఎంట్రీ ఇచ్చింది శ్వేతా బసు ప్రసాద్.

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి కానీ.. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ అందం హైద్రాబాద్ లో అడుగుపెట్టినా.. కొత్త లుక్ తో అదరగొట్టింది. గతంలో కాసింత బొద్దుగా కనిపించిన ఈ భామ.. ఇప్పుడు బాగానే చిక్కింది. ముంబై నీళ్లు బాగానే వంటబట్టడంతో.. స్లిమ్ నెస్ ను కూడా తనలో ఇముడ్చుకునేందుకు గట్టిగానే ఫిక్స్ అయింది. కొద్దిగా గ్లామర్ ను చూపిస్తూ.. స్లీవ్ లెస్ డ్రెస్సులో గ్యాంగ్ స్టార్స్ కి సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది శ్వేత.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు