ధనుష్‌కు నాగ్ ఓకే చెప్పేశాడా?

ధనుష్‌కు నాగ్ ఓకే చెప్పేశాడా?

ఒక సినిమా ఫలితాన్ని బట్టి వేరే ప్రాజెక్టుల మీదా ప్రభావం పడుతూ ఉంటుంది. ‘నేల టిక్కెట్టు’ దారుణమైన ఫలితాన్నందుకోవడంతో ఒక ప్రాజెక్టుకు బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. ఈ చిత్రం తర్వాత దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల.. తన తొలి చిత్ర హీరో, నిర్మాత అక్కినేని నాగార్జునతో ఓ సినిమా మొదలుపెట్టాల్సి ఉంది. అది ‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’.
కానీ ‘నేల టిక్కెట్టు’ ఫలితం చూశాక నాగార్జున పునరాలోచనలో పడ్డట్లుంది. సినిమాల ఎంపికలో ఏమాత్రం మొహమాటం ప్రదర్శించని నాగార్జున కళ్యాణ్‌కు హ్యాండ్ ఇచ్చినట్లే చెబుతున్నారు.

 అసలు ‘బంగార్రాజు’ కథ విషయంలో నాగ్ ముందు నుంచి సంతృప్తిగా లేడు. ఇప్పుడు ‘నేల టిక్కెట్టు’ లాంటి తర్వాత అసలే ఆ ప్రాజెక్టు మీద నాగ్ ఆసక్తిని ప్రదర్శించడం లేదని టాక్.
దీని బదుదు నాగార్జున కొన్నాళ్లుగా హోల్డ‌్‌లో పెట్టిన సినిమానే ఓకే చేసినట్లు సమాచారం. తమిళ కథానాయకుడు ధనుష్ దర్శకత్వంలో నాగ్ నటించబోతున్నాడట. కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు ‘పవర్ పాండి’ చిత్రంతో దర్శకుడిగా మారి సత్తా చాటుకున్నాడు ధనుష్.

దీని తర్వాత తమిళ-తెలుగు భాషల్లో ఓ మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ చిత్రంలో నాగార్జునకు ఓ కీలక పాత్ర ఆఫర్ చేశాడట. ఐతే నాగ్ వెంటనే నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ఆయన ఆ సినిమాకు ఓకే చెప్పేసినట్లు సమాచారం. నాగ్ కొత్త సినిమా ‘ఆఫీసర్’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తుండగా.. మరోవైపు నాని కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్లో నటిస్తున్నాడు నాగ్. ఆ చిత్రం ఓ కొలిక్కి వచ్చాక ఆయన ధనుష్ సినిమాలో నటించే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు