ఆ క్యారెక్టర్ కోసం మళ్లీ మళ్లీ

ఆ క్యారెక్టర్ కోసం మళ్లీ మళ్లీ

సినిమాలను హీరోలు బతికించేయడం చూస్తూ ఉంటాం. తెలుగు సినిమాల్లో హీరో డామినేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఒక్కోసారి సినిమా ఆకట్టుకోకపోయినా.. హీరో ఒక్కడే బండి లాగించేయడం అడపాదడపా కనిపిస్తుంది. అంటే హీరో కోసం సినిమాకు వెళ్లి వచ్చేయచ్చన్న మాట. కొన్నిసార్లు కొందరు కమెడియన్స్ కూడా ఇలా ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.

ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సినిమా అమ్మమ్మగారిల్లు చిత్రం విషయంలో మాత్రం విభిన్నంగా జరుగుతోంది. ఈ సినిమాలో క్యారెక్టర్ రావు రమేష్ పోషించిన పాత్రకు విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. సినిమా అంతా ఎమోషనల్ టచ్ తో సాగినా.. హీరో నాగశౌర్య- హీరోయిన్ షామిలి మధ్య సాగే లవ్ స్టోరీ అంతగా ఆకట్టుకోలేకపోయినా.. రావు రమేష్ మాత్రం అందరికీ నోటీస్ అయ్యాడు. ఆయన పోషించిన పాత్ర కోసం థియేటర్లకు రిపీట్ ఆడియన్స్ వస్తున్నారని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అలాగే షకలక శంకర్.. హేమ పాత్రలను కూడా జనాలు ఆదరిస్తున్నారు.

ఆరంభంతో పోల్చితే అమ్మమ్మగారిల్లు పుంజుకుంటోంది. వసూళ్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఫ్యామిలీ కంటెంట్ కావడంతో శాటిలైట్ రైట్స్ రూపంలో 2.75 కోట్ల మొత్తం దక్కినట్లు తెలుస్తోంది. సెంటిమెంటల్ మూవీకి నిరుత్సాహకరమైన ఫలితం తప్పదని అనుకున్నారు కానీ.. పుంజుకున్న విధానం.. శాటిలైట్ డీల్ చూస్తే మాత్రం.. అమ్మమ్మగారింటికి అంతగా నష్టాలు రాకపోవచ్చని ట్రేడ్ జనాలు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు