ఒకే పాటలో ఐదుగురు మహామహుల వాయిస్

ఒకే పాటలో ఐదుగురు మహామహుల వాయిస్

ఒక పాటలో అనేక మంది యాక్టర్స్ కనిపించడం కొన్నిసార్లు సాధ్యమే. లీడ్ పెయిర్ కు జోడీగా స్టెప్పులు వేసి అలరించడమో.. లేకపోతే స్టార్లు గెస్టు అప్పియరెన్స్ ఇచ్చి ఆకట్టుకోవడమో జరుగుతుంది. కొన్ని సార్లు ఫ్యామిలీ సాంగ్స్ లో కూడా బోలెడంత మంది జనాలు కనిపిస్తారు. కానీ ఒక పాటను ఐదు గురు సింగర్స్ పాడడం.. వారంతా దేశంలోనే ప్రఖ్యాతి చెందిన టాప్ మోస్ట్ సింగర్స్ కావడం మాత్రం ఇప్పటివరకూ జరగలేదు. సాక్ష్యం మూవీ దర్శకుడు శ్రీవాస్ దీన్ని సాధ్యం చేసి చూపిస్తున్నాడు.

గాయకులలో దేశం మొత్తం ఖ్యాతి గడించిన కె.జె. ఏసుదాస్.. ఎస్.పి. బాలసుబ్రమణ్యం.. హరిహరన్.. కైలాష్ ఖేర్.. బాంబే జయశ్రీ.. వీరంతా ఒకే పాటకు వర్క్ చేయబోతున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న సాక్ష్యం మూవీలో.. పంచభూతాలకు సంబంధించిన ఓ పాట ఉంటుంది. భూమి.. అగ్ని.. నీరు.. గాలి.. ఆకాశం.. వీటి గురించి చెబుతూ సాగే పాటకు ఐదుగురు సింగర్స్ పాడితే బాగుంటుందని తలచారు మేకర్స్. గేయ రచయిత అనంత శ్రీరామ్ రాసిన అధ్భుతమైన పాట కోసం.. ఈ ఐదుగురిని సంప్రదించగా.. అందరూ ఓకే చెప్పేయడంతో.. త్వరలోనే ఈ సూపర్బ్ సాంగ్ మనకు వినిపించబోతోంది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సాక్ష్యం మూవీని.. మొదటగా జూన్ 14నే విడుదల చేయాలని భావించినా.. గ్రాఫిక్ వర్క్ ఆలస్యం కావడంతో.. జూలై 20కు పోస్ట్ పోన్ చేసినట్లు రీసెంట్ గానే మేకర్స్ అనౌన్స్ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు