బుద్దుండే బికినీ వేశావా? షామాకు క్లాస్

బుద్దుండే  బికినీ వేశావా? షామాకు క్లాస్

అందాల భామలు తమ సోయగాలను ఆరబోసే ఫోటోలను నెట్ లో షేర్ చేయడం బాగా అలవాటు చేసేసుకున్నారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేయని సుందరాంగి ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదంటే.. అందులే ఆశ్చర్యమేమీ లేదు.

కానీ అందాల ఎగ్జిబిషన్ కి కూడా అంతో ఇంతో టైమింగ్ ఉండాలి. లేకపోతే.. ఇదుగో ఈ ఇద్దరు భామల మాదిరిగా జనాలతో నానా తిట్లు తినాల్సి వస్తుంది. టీవీ బ్యూటీ షామా సికందర్.. ఓ ఫోటోను నెట్ లో షేర్ చేసింది. ఇందులో హాటుహాటుగా తన అందాలను చూపిస్తూ ఉంటుంది. దీంతో ఈమెను నెటిజన్లు.. ముఖ్యంగా ముస్లిమ్స్ విపరీతంగా తిట్టిపోస్తున్నారు. పవిత్రమైన రంజాన్ రోజుల్లో ఒక ముస్లిం అయ్యుండి ఇలాంటి పనులు చేయడం ఏంటని నిలదీస్తున్నారు. ఇలా శృతి మించిన ఎక్స్ పోజింగ్ చేస్తూ.. పవిత్రమైన రోజులను అపహాస్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బుద్దుండే బికినీలు వేస్తున్నారా అని బూతులు తిడుతున్నారు.

షామా సికందర్ కు ముందు.. బిగ్ బాస్11 కంటెస్టెంట్ హీనా ఖాన్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. బికినీ పిక్చర్స్ ను షేర్ చేయడం అసంబద్ధం అంటున్నారు జనాలు. నిజానికి షామా ఇలాంటి గ్లామ్ పిక్స్ ను చాలానే షేర్ చేస్తూ ఉంటుంది. వీటిని ఫాలోయర్స్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు రంజాన్ మాసంలో చేయడం కారణంగానే.. ఈ బ్యూటీస్ కి అనేక మాటలు పడాల్సి వస్తోంది. అందుకే ప్రతీ పనికి టైమ్ తో పాటు టైమింగ్ కూడా చాలా ముఖ్యం అని పెద్దలు చెబుతుంటారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు