వావ్.. అది ట్రాలింగే కాదస్సలు..

వావ్.. అది ట్రాలింగే కాదస్సలు..

ఇప్పుడు సోషల్ మీడియా ఎత వ్యాప్తి చెందిందో.. ట్రాలింగ్ కూడా అంతే పెరిగిపోయింది. సెలబ్రిటీలపై జరుగుతున్న ఈ ట్రాలింగ్ పై చాలామంది రకరకాలుగా రియాక్ట్ అయ్యారు. కానీ తాను మాత్రం అందరికీ విభిన్నం అంటున్నాడు సల్మాన్ ఖాన్. రీసెంట్ గా సల్మాన్ మూవీ రేస్3 ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కేవలం 48 గంటల్లోనే 31 మిలియన్ల వ్యూస్ నమోదు చేసుకుని రికార్డు కూడా సృష్టించింది.

రంజాన్ కు రిలీజ్ అవుతున్న రేస్3 మూవీ కోసం బాగానే ప్రచారం చేస్తున్నాడు సల్మాన్. దస్ కాద దమ్ న్యూ సీజన్ లాంఛింగ్ ఈవెంట్ లో పాల్గొన్న సల్లూ భాయ్.. రేస్3 ట్రైలర్ పై సాగుతున్న ట్రాలింగ్ పై కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఓ రిపోర్టర్ అడిగితే.. నువ్వు ట్రాలింగ్ చేస్తున్నావా అన్నాడు సల్మాన్. చాలామంది చేస్తున్నారు కదా అని ఆ వ్యక్తి అనడంతో.. 'వాళ్లంతా ఒకరిద్దరు ఫాలోయర్స్ మాత్రమే ఉన్నవాళ్లు కదా.. దాన్ని కూడా ట్రాలింగ్ అంటారా. ట్రాలింగ్ ఎవరు చేస్తున్నారో నీకు తెలుసా.. తెలియదు కదా.. అదీ సంగతి. ఒకరో ఇద్దరో నలుగురో ఫాలోయర్స్ ఉన్నవారు ట్రాలింగ్ చేస్తే.. అదసలు ట్రాలింగే కాదు' అంటూ ట్రాలింగ్ కు కొత్త అర్ధం చెప్పాడు సల్మాన్ ఖాన్.

ఇప్పటి వరకూ ట్రాలింగ్ ను ఇంత లైట్ గా తీసుకున్న స్టార్ హీరో.. ఇండియాలో మరెవరూ లేరంటే ఆశ్చర్యమేమీ కాదు. తనే రాసిన సెల్ఫిష్ సాంగ్ త్వరలో రిలీజ్ అవుతుందని.. అది రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ట్రాలింగ్ చేయమంటూ కామెంట్ చేశాడు సల్మాన్.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు