'ఎన్టీఆర్'లో ఇవి తక్కువ.. 'యాత్ర'లో అవి ఎక్కువ

'ఎన్టీఆర్'లో ఇవి తక్కువ.. 'యాత్ర'లో అవి ఎక్కువ

బయోపిక్స్ కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది కానీ.. అనవసరం అయిన వివాదాలు ఎందుకులే అని మన టాలీవుడ్ జనాలు వీటికి దూరంగా ఉంటారు. కానీ బయోపిక్స్ విషయంలో ఇప్పుడు మహానటి కారణంగా ఓ క్లారిటీ వచ్చేసింది. తీసేవిధంగా తీస్తే.. జనాలతో మెప్పించవచ్చనే సంగతి అందరికీ అర్ధమైంది.

మహానటి రిలీజ్ కు ముందే.. సమకాలీన నేతలు అయిన ఎన్టీఆర్.. వైఎస్సార్ బయోపిక్స్ పై ప్రకటనలు వచ్చాయి. వీటిలో కంటెంట్ గురించి ఇప్పుడు విపరీతంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో నందమూరి బాలకృష్ణ నటిస్తుండగా.. ఆయన ఖ్యాతి గురించి ప్రచారం చేసే యాంగిల్ లోనే ఎక్కువ స్క్రిప్ట్ ను నడిపించనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య 70కి పైగా గెటప్స్ లో నటిస్తారనే విషయం.. దీన్ని ధృవీకరిస్తోంది కూడా. అంటే.. ఎన్టీఆర్ బయోపిక్ లో ఎక్కువగా ఫిలిం లైఫ్ ను.. అలాగే పర్సనల్ లైఫ్ ను చూపించనుండగా.. రాజకీయ కోణం టచ్ చేసేది తక్కువగానే ఉంటుందిట.

కానీ యాత్ర పేరుతో తెరకెక్కుతున్న వైఎస్సార్ బయోపిక్ మాత్రం ఇందుకు భిన్నంగా సాగనుందని అంటున్నారు. ప్రత్యర్ధి పార్టీల మీద విమర్శల బాణాలు బాగా ఎక్కువగానే ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఇటు సినిమాటిక్ టచ్ తో పాటు.. అటు పొలిటికల్ యాంగిల్ ను కూడా ఎక్కువగానే చూపించనున్నారట. వైఎస్సార్ అంటే మహానేతగా జనాలకు బాగా తెలిసిన పాయింట్ చుట్టూనే కథ నడపడనున్నారని టాక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English