అల్లు బాబూ.. అప్పుడే తోలేస్తున్నావా?

అల్లు బాబూ.. అప్పుడే తోలేస్తున్నావా?

స్టార్ హీరోల వారసులు అంటే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అనే సంగతి మన టాలీవుడ్ వరకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనేమీ లేదు. ఇలా హీరోగా మారేందుకు రకరకాల విషయాల్లో బోలెడంత ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో హార్స్ రైడింగ్ కూడా ఒకటి అనే సంగతి తెలిసిందే.

కానీ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ మాత్రం మహా స్పీడుగా ఉన్నాడు. ప్రస్తుతం నాలుగేళ్లు అంతే. మొన్న ఏప్రిల్ 4నే నాలుగు సంవత్సరాలు నిండి ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. ఇంత చిన్న పిల్లాడు గుర్రాలతో ఆడుకుంటున్నాడు అంటే.. సహజంగా ఏదో గుర్రాల బొమ్మలతో అనుకుంటాం. కానీ నిజంగానే గుర్రాలను ఎక్కేస్తున్నాడు అల్లు చిన్నోడు. అల్లు అయాన్ హార్స్ రైడింగ్ చేస్తున్న పిక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా చక్కర్లు కొడుతోంది. ఇంత చిన్న ఏజ్ లోనే హార్స్ రైడింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడంటే.. ఇంకొంత వయసు వచ్చేసరికి ఇంకెన్ని నేర్చుకుంటాడో అనిపించక మానదు.

మెగాస్టార్.. పవర్ స్టార్.. మెగా పవర్ స్టార్.. స్టైలిష్ స్టార్.. ఇలా ఇంత మందికి ఫ్యామిలీలో గుర్రాలు అంటే తెగ ఇష్టం ఉన్నపుడు.. ఆటోమేటిగ్గా ఈ బుల్లి అల్లు బాబుకి కూడా హార్స్ రైడింగ్ మీద మక్కువ కలగడం సహజం. అందుకే ఇలా చిన్న వయసులోనే హార్స్ రైడింగ్ లో ట్రైనింగ్ తీసేసుకుంటూ ఉండి ఉండొచ్చు కదా. బహుశా తన కొడుకుని యాక్టర్ చేద్దామని బన్నీకి కూడా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండి ఉంటుందని.. అందుకే ఇలా చిన్న వయసులోనే ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడని అనుకుంటున్నారు ఫ్యాన్స్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు