తెలుగమ్మాయిలో హాట్ యాంగిల్ చూడండి

 తెలుగమ్మాయిలో హాట్ యాంగిల్ చూడండి

తెలుగు హీరోయిన్లనే చాలా ట్రెడిషనల్ అనే అభిప్రాయం బలంగా ఉంటుంది. వాళ్లు హీరోయిన్లుగా పెద్ద స్థాయికి ఎదగలేకపోవడానికి ఇది కూడా ఒక కారణమని ఇండస్ట్రీ జనాలు భావిస్తారు. మన హీరోయిన్లు ముంబయి భామల్లా గ్లామరస్‌గా కనిపించడానికి ఇష్టపడరని.. కట్టుబాట్లు ఎక్కువని.. అందుకే ఫిలిం మేకర్స్ కూడా వీళ్లను కథానాయికలుగా ప్రిఫర్ చేయరని అంటుంటారు.

ఐతే ఈ తరం తెలుగు హీరోయిన్ల ఆలోచన కొంచెం మారుతోంది. వాళ్లు గ్లామరస్‌గా కనిపించడానికి సందేహించట్లేదు. తమను ఎప్పుడూ సంప్రదాయ కోణంలోనే చూడొద్దని.. తమలోనూ హాట్ యాంగిల్ ఉందని చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

తాను ఇప్పటిదాకా నటించిన సినిమాల్లో చాలా వరకు ట్రెడిషనల్ లుక్‌లోనే దర్శనమిచ్చిన అచ్చ తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా కూడా ఈ మధ్య తనలోని మరో కోణాన్ని చూపించే ప్రయత్నం చేస్తోంది. అప్పుడప్పుడూ హాట్ లుక్స్‌తో ఉన్న ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా ఆమె స్విమ్ సూట్లో ఉన్న ఫొటో షేర్ చేసింది. ఈషా రాత్రి పూట ఈత కొలనులో దిగి జలకాలాడుతున్న ఫొటో అది. దీంతో పాటుగా ఒక జీఐఎఫ్ కూడా షేర్ చేసింది. అందులో చాలా సెక్సీగా కనిపిస్తోందామె.

ఆ లుక్ చూస్తే ఈమె నిజంగా ఈషాయేనా అనిపిస్తే ఆశ్చర్యం లేదు. అంత హాట్‌గా ఉంది ఈషా అందులో. ఈ యాంగిల్ చూశాకైనా టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈషా విషయంలో ఆలోచన మార్చుకుని ఆమెకు గ్లామర్ క్యారెక్టర్లు కట్టబెడతారేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు