ఇండస్ట్రీలో సు'నిల్‌' అయిపోయాడా?

ఇండస్ట్రీలో సు'నిల్‌' అయిపోయాడా?

ఒకప్పుడు ప్రతి సినిమాలోను సునీల్‌ వుండాల్సిందేనని పట్టుబట్టి అతని కోసం పాత్రలు సృష్టించేవారు. కమెడియన్‌గా స్టార్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్న సునీల్‌ హీరో అయిపోవాలనే మోజులో పడి కెరియర్‌ వదిలేసుకున్నాడు. మొదట్లో హిట్లు వచ్చినా కానీ అది బలుపు కాదు వాపు అని తెలిసిరావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఈలోగా సునీల్‌ స్థానాన్ని భర్తీ చేసే కమెడియన్లు చాలా మంది పుట్టుకొచ్చారు.

ఇప్పుడు వివరం తెలిసి వచ్చి తిరిగి కామెడీ పాత్రలు చేయడానికి సునీల్‌ ఆసక్తి చూపిస్తున్నాడు. తనకున్న పరిచయాలతో కొన్ని చిత్రాల్లో అవకాశాలు పొందాడు. కానీ సునీల్‌కి ఎలాంటి పాత్రలు రాయాలనే దానిపై దర్శకులకి క్లారిటీ లేకుండా పోయింది. సునీల్‌పై గతంలో చేసినట్టుగా కామెడీ చేస్తే జనం చూస్తారా లేక అతడిని హీరోలానే చూస్తారా అని అర్థం కావడం లేదు.

సునీల్‌ మాత్రం మునుపటిలా ఎలాంటి క్యారెక్టరయినా చేసేస్తానని చెబుతున్నా కానీ అతడికి బంకు, బంతి లాంటి క్యారెక్టర్లు రాయడానికి దర్శకులు మొహమాట పడుతున్నారట. సునీల్‌ కమెడియన్‌గా ఒక రెండు, మూడు సినిమాలు విడుదలై జనం మళ్లీ అలవాటు పడితే తప్ప సునీల్‌ తిరిగి ఫామ్‌లోకి రాడేమో అంటున్నారు. టాలెంట్‌ వుంది కనుక, తన శైలి కామెడీ చేసేవాళ్లు ఎవరూ లేరు కనుక రైట్‌ క్యారెక్టర్స్‌ పడితే సునిల్‌ నుంచి ఫుల్‌ అయిపోవడం పెద్ద కష్టం కాదులెండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English