ఆ మార్కెట్‌ కెపాసిటీ ఇంతేనండీ

ఆ మార్కెట్‌ కెపాసిటీ ఇంతేనండీ

ఓవర్సీస్‌ మార్కెట్‌లో ఏ సినిమా ఎలా ఆడుతుంనేది అంచనా వేయడం చాలా కష్టంగా వుంది. బాహుబలి 2 చిత్రానికి యుఎస్‌లోనే ఇరవై మిలియన్‌ డాలర్లు వసూలు కావడంతో అసలు తెలుగు సినిమా స్టామినా ఎంత అనేదానిపై క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఇటీవల విడుదలైన చిత్రాలతో ఓవర్సీస్‌ మార్కెట్‌పై ఒక అంచనాకి రావచ్చు. రంగస్థలం, భరత్‌ అనే నేను రెండు చిత్రాలు మూడున్నర మిలియన్‌ డాలర్లు వసూలు చేసాయి.

భరత్‌ అనే నేనుకి ఒక లక్ష డాలర్లు తక్కువ వచ్చాయి కానీ మొత్తం మీద ఒక భారీ చిత్రం రేంజ్‌ ఇదీ అని తెలిసింది. ఇక క్రేజ్‌ వున్న చిన్న సినిమాకి మంచి టాక్‌ వస్తే ఏ రేంజ్‌కి వెళ్లగలదనేది మహానటి చూపించింది. ఈ చిత్రానికి రెండున్నర మిలియన్లు వసూలయ్యాయి. చిన్న సినిమాల్లో భారీ స్థాయి విజయమిది. వీటిలో చాలా వాటికి కొద్ది నెలల క్రితం వరకు వున్న మూవీ పాస్‌ వగైరా వెసులుబాటు కూడా లేదు కనుక ఇది తెలుగు సినిమా రియల్‌ పొటెన్షియల్‌ అనుకోవాలి. రంగస్థలం, భరత్‌ అనే నేను రెండు వారాల వ్యవధిలోనే విడుదలయ్యాయి కనుక కాస్త గ్యాప్‌లో పెద్ద సినిమా వచ్చి పెద్ద హిట్‌ అయితే నాలుగు మిలియన్‌ డాలర్లు వసూలయ్యే అవకాశముంది. యుఎస్‌ బయట తెలుగు సినిమాకి పెద్ద మార్కెట్‌ ఏమీ లేదు.

కొంచెం కొంచెంగా పెరుగుతున్నా కానీ ఇంకా విస్తరించడానికి టైమ్‌ పడుతుంది. ప్రస్తుతానికి మాత్రం చిన్న సినిమాలు పెద్ద హిట్‌ అయితే రెండు మిలియన్లు, పెద్ద సినిమాలు హిట్‌ అయితే మూడు మిలియన్లు యుఎస్‌లో వసూలవుతాయని ఖాయం చేసుకోవచ్చు. కాకపోతే పెద్ద సినిమాలు ఫెయిలయితే మాత్రం పెట్టిన దాంట్లో సగానికి పైగా పోతుందని కూడా ఫిక్స్‌ అయిపోయి రిస్కు చేయాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు