మహేష్‌కి ల్యాండ్‌మార్క్‌ భయం!

మహేష్‌కి ల్యాండ్‌మార్క్‌ భయం!

ల్యాండ్‌ మార్క్‌ సినిమాలు హిట్టవ్వాలనే రూలేమీ లేదు. అంచనాలు భారీగా వుంటాయి కానీ చాలా సార్లు మైలురాళ్లు బోల్తా కొట్టిన సందర్భాలే వున్నాయి. రీసెంట్‌గా పవన్‌ కళ్యాణ్‌ ఇరవై అయిదవ సినిమాగా ప్రచారమైన 'అజ్ఞాతవాసి' ఎంత ఘోరంగా ఫ్లాప్‌ అయిందో తెలిసిందే. ఎన్టీఈర్‌ ఇరవై అయిదవ సినిమా 'నాన్నకు ప్రేమతో' కాస్త మెరుగే కానీ అది కూడా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్‌ ఈవెన్‌ కాలేకపోయింది.

పవన్‌, ఎన్టీఆర్‌, మహేష్‌ కెరియర్లు దాదాపు ఒకేలా సాగుతుంటాయి కనుక ఇప్పుడు తన ఇరవై అయిదవ సినిమా ఫలితం ఎలాగుంటుందనే టెన్షన్‌ మహేష్‌కీ వుందట. అందుకే ఈ చిత్రం కథపై ఎక్కువ టైమ్‌ కేటాయించమని, స్క్రిప్టుని ఒకటికి పదిసార్లు రీరైట్‌ చేసి బెస్ట్‌ అవుట్‌పుట్‌ వచ్చాక మొదలు పెడదామని అంటున్నాడట. అసలే ఒక సినిమా హిట్టయిన తర్వాత తదుపరి వచ్చే చిత్రం సరిగా ఆడదనే ట్రాక్‌ రికార్డ్‌ మహేష్‌ది.

కెరియర్లో ఒక్కసారి మినహా మరెప్పుడూ మహేష్‌ని వరుస విజయాలు వరించలేదు. అందుకే వంశీ పైడిపల్లితో చేస్తోన్న ఇరవై అయిదవ చిత్రం పట్ల మహేష్‌ అదనపు జాగ్రత్త పాటిస్తున్నట్టు సమాచారం. దిల్‌ రాజు, అశ్వనీదత్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈమెకి కూడా తెలుగులో హీరోయిన్‌గా ఇంతవరకు హిట్‌ సినిమా లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు