ఆర్జీవీ సెంటిమెంట్‌ డ్రామా అందుకేనా?

ఆర్జీవీ సెంటిమెంట్‌ డ్రామా అందుకేనా?

రాంగోపాల్‌వర్మ తనకి ఎలాంటి ఎమోషన్స్‌ లేవని చెబుతుంటాడు. మానవ భావోద్వేగాలకి అతీతుడనని డబ్బా కొడుతుంటాడు. కానీ ఆఫీసర్‌ ప్రీ రిలీజ్‌ వేడుకలో వర్మ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. నాగార్జున తనకి కష్టకాలంలో అండగా నిలబడ్డ దాని గురించి చెబుతోన్న సమయంలో వర్మ కళ్లు ఎర్రబారాయి. ఇంకా మాట్లాడితే ఏడ్చేసేలా వున్నానని, అది తన ఇమేజ్‌కి మంచిది కాదని చెప్పి మాట దాటేసాడు.

అయితే ఎన్నడూ లేనిది వర్మ ఎందుకు ఇలా బేలగా మాట్లాడినట్టు? వేదికపైనుంచి నాగ్‌ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎందుకలా ప్రయత్నించినట్టు? అఖిల్‌తో సినిమా చేయాలనేది వర్మ ప్లాన్‌. ఆఫీసర్‌ రిజల్ట్‌ని బట్టి చూద్దామని నాగార్జున అన్నాడట. తను పలుమార్లు అఖిల్‌తో మూవీ వుంటుందని చెబుతున్నా కానీ నాగార్జున, అఖిల్‌ మాత్రం ఇంతవరకు ఆ సంగతి ప్రస్తావించలేదు. కనీసం ఈ వేడుకలోను అక్కినేని హీరోలు ఆ ఊసెత్తలేదు. ఆఫీసర్‌ బిజినెస్‌ కోసమే వర్మ ఈ ప్రకటన చేసాడని అప్పట్లో అనుకున్నారు.

ఆఫీసర్‌ అటు ఇటు అయినా తనని నాగార్జున దూరం పెట్టకుండా వుండడం కోసం, అవకాశం వుంటే అఖిల్‌తో సినిమా ఇస్తాడనే ఆశతోను వర్మ ఇలా మాట్లాడాడని ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు. అయితే నాగార్జున ఎంత పక్కా వ్యాపారవేత్త అనేది తెలిసిందే. కెరియర్‌ చివరి దశలో వుంది కనుక రిస్క్‌ చేసి ఈ టైమ్‌లో వర్మతో ఆఫీసర్‌ చేసాడు కానీ చూస్తూ చూస్తూ కొడుకు కెరియర్‌ని రిస్కులో పెట్టడనేది ప్రత్యేకించి చెప్పాలా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు