అరెరే.. అరెరే.. డైరెక్టర్ జోకేశాడే

అరెరే.. అరెరే.. డైరెక్టర్ జోకేశాడే

ఓ సినిమా ఫ్లాప్ కావాలనే ఉద్దేశ్యంతో ఎవరూ స్టార్ట్ చేయరు.. కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీయరు. అందరూ హిట్టు కావాలనే కోరుకునే కష్టపడతారు. కానీ సక్సెస్ రేటు అతి తక్కువగా ఉండే ఇండస్ట్రీ సినిమా రంగమే. పైగా ఎప్పటికప్పుడు మారుతున్న ఆడియన్స్ టేస్ట్ కు అనుగుణంగా మూవీస్ రూపొందించడం కత్తి మీద సామే. అందుకే ఎంతో జాగ్రత్తగా మూవీస్ ను రూపొందిస్తారు మేకర్స్.

అలాగని అన్నిసార్లు అనుకున్న రిజల్ట్స్ రావు. అలాగని బాలేదని అన్నవారిని విమర్శించేయడం సరైన విషయం కాదు. రివ్యూలు-సినిమాలపై రగడ చాలాకాలంగానే ఉంది. పల్లెటూరి నేపథ్యంతో రెండు హిట్టు సినిమాలు సినిమాలు తీసిన కళ్యాణ్ కృష్ణ.. మొదటిసారి మాస్ ఫార్ములా చిత్రం ఎంచుకుని తీసిన మూవీ నేల టిక్కెట్టు. మొదటి రోజు తొలి ఆటకే దారుణమైన టాక్ తెచ్చుకుంది. అందుకు తగినట్లుగానే రివ్యూలు కూడా వచ్చాయి. బాగాలేదంటే.. రివ్యూలు కూడా అలాగే ఉంటాయి మరి.

అట్టర్ ఫ్లాపు సినిమాలకు కూడా సక్సెస్ మీట్లు.. స్పెషల్ ఇంటర్వ్యూలు ఇవ్వడం మన జనాలకు అలవాటే. ఫ్లాప్ అయితే సినిమా ఆడలేదని ఒప్పుకునేతత్వం నాని లాంటి లాంటి అతికొందరికే ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ మాత్రం.. తన సినిమా జనాలకు బాగా నచ్చిందని.. కానీ రివ్యూలు మాత్రం తనకు నచ్చలేదని అంటున్నాడు. ఈ కామెంట్స్ ను పరిశీలిస్తే.. ఈయన తీసిన అద్భుత చిత్రాన్ని రివ్యూలు పాడు చేస్తున్నట్లుగా ఉంది. మరి ఇదే మాట ఓ సారి రవితేజతో కూడా చెప్పించరాదూ కళ్యాణ్? నాని మాదిరిగా.. తన సినిమా హిట్టో ఫట్టో అనే విషయం రవితేజ లాంటి హీరో చెబితే.. కాస్త జనాలు కూడా ఆలోచిస్తారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు