హృతిక్ పక్కన ఛాన్స్ కొట్టేసిందిగా

హృతిక్ పక్కన ఛాన్స్ కొట్టేసిందిగా

లోఫర్ భామ దిశా పాట్నీ.. బాలీవుడ్ చెక్కేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈమె ఫిట్నెస్.. స్పీడు చూసి చాలానే అవకాశాలు దరికి చేరాయి. వీటిలో చాలావరకూ ఆఫర్స్ ను ఏ మాత్రం లెక్క చేయకుండా చేయను పొమ్మను చెప్పేసింది దిశా పాట్నీ. అమ్మడి వ్యవహారం చూసి పలువురు నిర్మాతలకు చిర్రెత్తుకొచ్చింది కూడా.

అయితే.. తన స్థాయి వేరని.. టాప్ స్టార్స్ తో సినిమాలు చేసేందుకే ఇండస్ట్రీలోకి వచ్చానని.. ఆ రేంజ్ అందుకుంటానని ధైర్యంగా చెప్పిన దిశ.. అదే యాంగిల్ లో ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. హీరోయిన్ అనే బ్రాండ్ కంటే.. టైగర్ ష్రాఫ్ కు గాళ్ ఫ్రెండ్ అనే యాంగిల్ ఎక్కువగా ప్రచారం అయినా ఏ మాత్రం పట్టించుకోలేదు. రీసెంట్ గా బాఘీ2తో బంపర్ హిట్ కొట్టి తనేంటో ప్రూవ్ చేసుకున్న ఈ సుందరికి.. సల్మాన్ ఖాన్ మూవీలో ఛాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్- ప్రియాంక చోప్రా నటిస్తున్న భరత్ మూవీలో ఓ హీరోయిన్ గా ఎంపికైన దిశ.. ఇప్పుడు హృతిక్ రోషన్ సినిమాలో లీడ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

రోహిత్ ధావన్ దర్శకత్వంలో సాజిద్ నడియడ్వాలా నిర్మాతగా.. హృతిక్ రోషన్ తో ఓ సినిమాకు రంగం సిద్ధం అవుతోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలోనే ఉన్న ఈ చిత్రంలో హీరోయిన్ అవకాశం కోసం.. దిశా పాట్నీని మేకర్స్ అప్రోచ్ కాగా.. రెండో ఆలోచన కూడా లేకుండా ఓకే చెప్పేసింది ఈ బ్యూటీ. తన టార్గెట్ టాప్ స్టార్స్ తో సినిమాలు చేయడమే అని చెప్పిన ఏడాదికే.. సల్మాన్ ఖాన్.. హృతిక్ రోషన్ లతో సినిమాలను ఖాతాలో వేసుకుని.. దిశ తన లక్ష్యాన్ని రీచ్ అయిందని చెప్పచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు