వర్మకు బాగానే సపోర్ట్ దొరికిందే..

వర్మకు బాగానే సపోర్ట్ దొరికిందే..

రామ్ గోపాల్ వర్మకు వివాదాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో ఆయన గొడవ గురించి అందరికీ తెలిసిందే. ఇంతకుముందు ఆ గొడవను తేలిగ్గా తీసుకునేవాళ్లు కానీ.. గత నెలలో శ్రీరెడ్డి గొడవ బయటికి వచ్చినపుడు మాత్రం వ్యవహారం చాలా సీరియస్ అయింది. అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వర్మను ఎంత తీవ్రంగా తిట్టాడో తెలిసిందే. మరోవైపు నాగబాబు కూడా వర్మనుద్దేశించి అలాగే మాట్లాడాడు. ఇండస్ట్రీపై మెగా ఫ్యామిలీకి ఉన్న పట్టేంటో తెలిసిందే కాబట్టి.. పరిశ్రమలోని మెజారిటీ జనాలు వర్మను వ్యతిరేకించారు. ఆయన్ని తెలుగు సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి.

ఈ నేపథ్యంలో వర్మ తీసిన కొత్త సినిమా ‘ఆఫీసర్’ సంగతేమవుతుందో అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఇందులో కథానాయకుడిగా నటించిన నాగార్జున ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాడు. వర్మ విషయంలో ఎలా స్పందించాలో తెలియని ఆయన పడిపోయాడు. తన సినిమా ఊసులు కూడా కొన్నాళ్ల పాటు కట్టిపెట్టాడు. శ్రీరెడ్డి ఇష్యూ సద్దుమణగడంతో మళ్లీ ‘ఆఫీసర్’ ప్రమోషన్లు మొదలుపెట్టారు.

ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్‌కు నాగార్జున ఫ్యామిలీ అంతా హాజరైంది. నాగ్‌తో పాటు అందరూ వర్మను తెగ పొగిడేశారు. అతడితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మరోవైపు కీరవాణి.. తనికెళ్ల భరణి లాంటి వాళ్లు ఈ వేడుకకు వచ్చి వర్మను ఆకాశానికెత్తేశారు. మొత్తంగా ఈ వేడుక అంతా వర్మ చుట్టూనే తిరిగింది. అందరూ అతడిని పొగిడిన వాళ్లే. చిరుకు అత్యంత సన్నిహితుల్లో ఒకడైన నాగ్.. శ్రీరెడ్డి ఇష్యూలో వర్మ ప్రమేయాన్ని మరిచిపోయి ఇలా అతడిని పొగడ్డం.. మిగతా వాళ్లూ ఆయనకు తోడవడం విశేషమే. ఈ సినిమా కొంచెం లేటుగా రిలీజవుతోంది కాబట్టి ఓకే కానీ.. ఒక నెల ముందుగా రిలీజ్ ఉంటే మాత్రం చాలా ఇబ్బందయ్యేది. ఇలా వర్మ గురించి మాట్లాడే పరిస్థితే ఉండేది కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు