అక్కినేని కాంపౌండ్‌ వదిలి తప్పు చేసాడా?

అక్కినేని కాంపౌండ్‌ వదిలి తప్పు చేసాడా?

కళ్యాణ్‌ కృష్ణ అనే వ్యక్తి ఎవరనేది కూడా ఎవరికీ తెలియనపుడు 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రానికి అవకాశమిచ్చి దర్శకుడిగా అతడిని నిలబెట్టాడు నాగార్జున. ఆ తర్వాత నాగ చైతన్యతో 'రారండోయ్‌ వేడుక చూద్దాం' చిత్రానికి కూడా కళ్యాణ్‌ కృష్ణకి అవకాశం వచ్చింది. వరుసగా రెండు చిత్రాలు విజయవంతమైనా కానీ రెండిటిపై నాగార్జున నీడ బాగా పడింది. ఆ చిత్రాలు విజయవంతం కావడానికి నాగార్జున కారకుడని, ఆయన అనుభవం వల్లే అందులో చాలా సన్నివేశాలని ట్రిమ్‌ చేయడం, రీషూట్‌ చేయడం జరిగిందని, రెండు సినిమాలు జనామోదం పొందే విధంగా తీర్చిదిద్ది రిలీజ్‌ చేయడంలో నాగార్జున పాత్ర చాలా వుందని అంటారు.

కళ్యాణ్‌కృష్ణ మూడవ చిత్రాన్ని నిర్మించడానికి కూడా నాగార్జున ఓకే అన్నారు. అఖిల్‌ లేదా నాగ చైతన్య కోసం కథ సిద్ధం చేయమన్నారు. అయితే తనకి సక్సెస్‌ వస్తున్నా ఇండివిడ్యువల్‌గా పేరు రావడం లేదని కళ్యాణ్‌కృష్ణ ఆ కాంపౌండ్‌నుంచి బయటకి వచ్చేసాడు. మూడవ సినిమాపై ఎవరి ముద్ర లేకుండా తీసి తన టాలెంట్‌ చాటుకుందామని చూసాడు. అయితే ఈ హడావిడిలో 'నేల టిక్కెట్టు' అనే నాసి రకం సినిమాని తయారు చేసాడు. ఎంతోమంది రిజెక్ట్‌ చేసిన కథ అయినా కానీ చాలా మందికి వినిపించి, చివరకు రవితేజతో ఓకే చేయించుకున్నాడు.

రవితేజకి ఈ సినిమా ఫ్లాప్‌ అవడం వల్ల జరిగే నష్టం లేదు. అతనికి మరో మూడు సినిమాలు ఇప్పటికే లైన్లో వున్నాయి. కానీ కళ్యాణ్‌కృష్ణకి ఇప్పుడు అవకాశం రావడమే కష్టం. అన్నపూర్ణ సంస్థ వదిలేసుకోవడం వల్ల మళ్లీ తిరిగి అక్కడినుంచి ఆహ్వానం వస్తుందనేది కూడా అనుమానం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు