పవన్‌కళ్యాణ్‌ రూట్లోకి వెళ్లిపోయాడు

పవన్‌కళ్యాణ్‌ రూట్లోకి వెళ్లిపోయాడు

పవన్‌కళ్యాణ్‌ యూత్‌లో అంతటి పాపులర్‌ స్టార్‌ అవడానికి కారణం అతను కెరియర్‌ బిగినింగ్‌లో చేసిన క్యారెక్టర్లే అనేది తెలిసిందే. పవన్‌ తర్వాత మాస్‌ హీరోగా ఎదిగినా కానీ యూత్‌ హీరోగా పడ్డ పునాది అతడిని టాప్‌కి తీసుకెళ్లింది. రెగ్యులర్‌ హీరోలు చేసే పాత్రలు కాకుండా యూత్‌ ఐడెంటిఫై చేసుకునే క్యారెక్టర్లతో పవన్‌ స్టార్‌ అయ్యాడు. ఇప్పుడు అతని మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ కూడా మేనమామ బాటనే ఫాలో అవుతున్నాడు. హీరోగా ఇప్పటికే నిలబడిపోయినా కానీ తనకంటూ ఒక ఇమేజ్‌ని తెచ్చుకోలేకపోయాడు తేజ్‌.

మాస్‌ సినిమాల వెంటపడి వరుస ఫ్లాపులు కొని తెచ్చుకున్న సాయి ధరమ్‌ తేజ్‌కి ఇప్పుడు జ్ఞానోదయమయింది. అందుకే తన సినిమాల్లో సగటు యువత రిలేట్‌ చేసుకునే అంశాలుండాలని చూస్తున్నాడు. పవన్‌ చేసిన తొలిప్రేమ, తమ్ముడు లాంటి కథలనే అతను ఇప్పుడు ఎంచుకుంటున్నాడు. కరుణాకరన్‌తో చేస్తోన్న 'తేజ్‌' చిత్రం తొలిప్రేమ మాదిరిగా ప్లెజెంట్‌గా, యూత్‌ఫుల్‌గా వుంటుందట.

దాని తర్వాత చేయబోయే 'చిత్రలహరి'లో మధ్య తరగతి యువకుడిగా కనిపిస్తాడు. ఇకపై తనని తాను మాస్‌ హీరోగా ఎస్టాబ్లిష్‌ చేసుకునేందుకు సాయి ధరమ్‌ తేజ్‌ ఇష్టపడడం లేదు. అలాంటి కథలు ఏవి వచ్చినా రిజెక్ట్‌ చేసేస్తున్నాడు. మరి పవన్‌ రూట్లో తేజ్‌కి సక్సెస్‌ వస్తుందా రాదా అనేది త్వరలో తెలిసిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు