నాగార్జునని ఫాన్సే ట్రోల్‌ చేస్తున్నారు

నాగార్జునని ఫాన్సే ట్రోల్‌ చేస్తున్నారు

అభిమాన హీరో సినిమా వస్తోందంటే ఫాన్స్‌కి నిద్ర పట్టదు... ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆరాటంతో. కానీ ఇక్కడ కాస్త భిన్నంగా అభిమాన హీరో సినిమా విడుదలకి సిద్ధమైందని అభిమానులు నిద్ర కోల్పోతున్నారు... ఎలాంటి సినిమా అవుతుందనే ఆందోళనతో. రాంగోపాల్‌వర్మతో నాగార్జున సినిమా అనౌన్స్‌ అయినప్పుడే ఫాన్స్‌కి గుబులు మొదలయింది. అయితే నాగార్జున కథ వినకుండా, అంత నమ్మకం లేకుండా చేయడు కదా అని సర్ది చెప్పుకున్నారు.

కానీ పోస్టర్స్‌తో మొదలు పెట్టి ట్రెయిలర్‌ వరకు ఏమైనా కాస్త హోప్‌ వున్నా కానీ దానిని వర్మ సక్సెస్‌ఫుల్‌గా కిల్‌ చేసేసాడు. ఈ చిత్రానికి ప్రమోషన్‌ ఎలా చేస్తే ఆకట్టుకోవచ్చుననేది కూడా వర్మకి తోచడం లేదు. పబ్లిసిటీ పరంగా కూడా తన ఆలోచనలన్నీ ఆవిరి అయిపోయాయన్నట్టు ఏదేదో చేస్తున్నాడు. ఏ సౌండ్‌ మూమెంట్‌ అంటూ సినిమాలోని కొన్ని సన్నివేశాల బిట్స్‌ని కట్‌ చేసి వదులుతున్నారు. హీరో కనుక తన వంతుగా ట్వీట్‌ చేయాలి కనుక నాగార్జున వీటిని తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తున్నాడు.

ఆ సౌండ్‌ మూమెంట్స్‌ చూసిన అభిమానులే నాగార్జునని ట్రోల్‌ చేయడం విశేషం. ఇతర హీరోల అభిమానులకి అవకాశమే ఇవ్వకుండా ఆఫీసర్‌ని అక్కినేని అభిమానులే కామెడీ చేసి పారేస్తున్నారు. ఈ సినిమా ఎలా వుండబోతుందనేది ఈ బిట్లు చూస్తే ఇంకా క్లారిటీ వచ్చేస్తోంది. కానీ వర్మ మాత్రం తన సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్‌ అవుతుందనే ధీమాతోనే వున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు