టాప్‌ లేపిందప్పుడు.. ఊపే లేదిప్పుడు

టాప్‌ లేపిందప్పుడు.. ఊపే లేదిప్పుడు

'కబాలి' విడుదలకి ముందు జాతీయ వ్యాప్తంగా క్రేజ్‌ వచ్చింది. రజనీకాంత్‌ ఓల్డ్‌ గెటప్‌, డాన్‌ క్యారెక్టర్‌ దేశ వ్యాప్తంగా 'కబాలి' కోసం ఎదురు చూసేలా చేసాయి. అయితే ఆ చిత్రాన్ని సీరియస్‌ డ్రామాగా మలిచిన రంజిత్‌ ఫాన్స్‌ని తీవ్రంగా నిరాశ పరిచాడు. ఓపెనింగ్స్‌తో తమిళనాట రికార్డులు నెలకొల్పినా కానీ 'కబాలి' రజనీ ఫాన్స్‌కి కూడా ఫేవరెట్‌ సినిమా కాలేకపోయింది.

అయినా కానీ దానికి సీక్వెల్‌ని అదే దర్శకుడితో రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ నిర్మించాడు. 'కరికాలన్‌' పేరిట తమిళ్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని 'కాలా'గా తెలుగులో అనువదించారు. ఈ చిత్రం విడుదలకి సమీపిస్తున్నా కానీ 'కబాలి'కి వచ్చిన క్రేజ్‌లో సగం కూడా కనిపించడం లేదు. విడుదల పలుమార్లు వాయిదా పడడం ఒక కారణమైతే, 'కబాలి' చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నపుడు అలా నిరాశ పరచడం వల్ల ఈసారి రంజిత్‌ని ఎవరూ నమ్మడం లేదు.

కాకపోతే ధనుష్‌ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం, రజనీ మరోసారి రంజిత్‌కే అవకాశం ఇవ్వడం అనే పాయింట్స్‌ని బట్టి దీనిపై నమ్మకం పెట్టుకోవచ్చు. ట్రెయిలర్స్‌ కూడా ఈసారి రజనీ మార్కు మిస్‌ కాకుండా జాగ్రత్త పడ్డారనే సంగతి తెలియజేస్తున్నాయి. తక్కువ హైప్‌తో రావడం కూడా ఈ చిత్రానికి ప్లస్‌ అయ్యే ఛాన్స్‌ వుంది. జూన్‌ 7న రాబోతున్న 'కాలా'కి తెలుగునాట అయితే కాంపిటీషనే లేదు. టాక్‌ వస్తే మాత్రం రజనీ బాక్సాఫీస్‌ ధమాకా చూసే వీలుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు