పవన్‌ గెలుస్తాడనే నమ్మకం త్రివిక్రమ్‌కి లేదు!

పవన్‌ గెలుస్తాడనే నమ్మకం త్రివిక్రమ్‌కి లేదు!

పవన్‌కళ్యాణ్‌ నిన్న మొన్నటి వరకు వ్యవహరించిన తీరుతో జనసేన వచ్చే ఎన్నికల్లో ఏదైనా ప్రభావం చూపించగలదనే దానిపై అభిమానులకే ఆశలు లేవు. అయితే ప్రస్తుతం జన పోరాట యాత్ర పేరిట ఉత్తరాంధ్ర పర్యటిస్తోన్న పవన్‌ అక్కడ తన వాగ్ధాటితో ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నాడు. సమయానుకూలంగా మాట్లాడుతూ జనాలని మెప్పిస్తున్నాడు.

దీంతో వచ్చే ఎన్నికలపై జనసేన ప్రభావం పట్ల ఫాన్స్‌కి ఆశలు చిగురిస్తున్నాయి. కర్నాటక ఎన్నికలు, ఫలితాల నేపథ్యంలో జనసేన అలా ప్రభుత్వాన్ని ఫార్మ్‌ చేయడంలో పాత్ర పోషించగలదని ఆశిస్తున్నారు. పవన్‌ ఇక సినిమాలకి స్వస్తి పలికినట్టేనని, రాజకీయాల్లోనే వుంటాడని అభిమానులు భావిస్తూ వుండగా, అతనికి అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు మాత్రం ఇంకా వాటిని తిరిగి తీసుకోలేదు.

ఎన్నికలయ్యే వరకు వాటిని అలాగే వుంచుకోమని అంటున్నారు. ఒకవేళ ఎన్నికల్లో ఫలితం అటు ఇటు అయితే పవన్‌ తిరిగి సినిమాలతో బిజీ అవుతాడని, అప్పుడు తమకే అవకాశమిస్తాడని భావిస్తున్నారు. పవన్‌ ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్‌ కూడా తను పవన్‌ కోసం రాసుకున్న కథని అలాగే వుంచేసాడు. 2019 తర్వాత పవన్‌ తిరిగి సినిమాలు చేస్తే 'కోబలి' ఆయనతోనే చేస్తానని త్రివిక్రమ్‌ పేర్కొనడం గమనార్హం.

ఆ ఎన్నికల్లో పవన్‌ గెలుపొందినా, రాష్ట్ర రాజకీయాలపై ఏదైనా బలమైన ముద్ర వేసినా తిరిగి నటించడం కష్టం. కానీ త్రివిక్రమ్‌ 'కోబలి' పవన్‌తోనే అంటున్నాడంటే జనసేన విజయంపై త్రివిక్రమ్‌కి అంత నమ్మకం లేదనట్టుందని సోషల్‌ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English