విక్రమార్కుడు 2.. స్టోరీ రెడీ.. కానీ..

విక్రమార్కుడు 2.. స్టోరీ రెడీ.. కానీ..

ఇప్పటివరకూ రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలన్నీ అద్భుతాలే. కాసింత తక్కువ ఆడి ఉండొచ్చు.. కొన్ని ఎక్కువగా ఆడి ఉండొచ్చు. కానీ.. ప్రతీ సినిమాకు ప్రత్యేకత ఉందనే విషయం ఒప్పుకోవాల్సిందే. వీటిలో రవితేజ హీరోగా రూపొందిన విక్రమార్కుడు మూవీ కూడా ఉంటుంది. మాస్ మహరాజ్ ను రెండు పాత్రలలో చూపించిన తీరు సూపర్బ్.

అందుకే ఈ సినిమా బాలీవుడ్ తో పాటు పలు భాషలలో రీమేక్ అయ్యి ఆకట్టుకుంది. ఆ చిత్రానికి కథ అందించిన వ్యక్తి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఇప్పుడీయన విక్రమార్కుడు కథకు సీక్వెల్ రెడీ చేసేశారు. ఈ విషయం ఇప్పుడు అఫీషియల్ గానే చెప్పేశారు. కానీ ఈ కథను తెలుగులో తీసే అవకాశాలు తక్కువే అని అంటున్నారు. ఇందుకు కారణం.. ఈయన విక్రమార్కుడుకు కాకుండా.. హిందీలో రూపొందిన రౌడీ రాథోడ్ కు సీక్వెల్ కథ సిద్ధం చేశాడు. రౌడీ రాథోడ్ కథ రెడీ అయిందని.. త్వరలో సంజయ్ లీలా భన్సాలీకి వినిపించబోతున్నారని తెలుస్తోంది.

అక్షయ్ కుమార్ హీరోగా ప్రభుదేవా డైరెక్షన్ లో రూపొందిన రౌడీ రాథోడ్.. బాలీవుడ్ లో ఇరగదీసి ఆడేసింది. అందుకే ఆ నిర్మాత కోరిక మేరకే.. సీక్వెల్ కథ రెడీ చేశారు విజయేంద్ర ప్రసాద్. భన్సాలీకి ఇంకా ఈ స్క్రిప్ట్ పంపాల్సి ఉండగా.. ఓ సారి స్టోరీ ఓకే అనుకుంటే.. రౌడీ రాథోడ్2కు రంగం రెడీ అయిపోయినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English