మహానటి.. వాట్ ఎన్ అచీవ్మెంట్

మహానటి.. వాట్ ఎన్ అచీవ్మెంట్

మహానటి అద్భుతం చేసింది. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ లేకున్నా.. విడుదలకు ముందు అంతగా హైప్ కూడా లేకున్నా.. ఈ సినిమా అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్లింది. తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా సాధించిన విజయం అసాధారణమైనది.

పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు మిలియన్ మార్కును అందుకోవడానికే కష్టపడుతుంటే ఈ చిత్రం ఏకంగా 2.5 మిలియన్ మార్కును టచ్ చేయడం విశేషం. ఈ స్థాయి సినిమాకు అది చాలా పెద్ద అచీవ్మెంటే. ఈ క్రమంలో ‘మహానటి’ పెద్ద పెద్ద సినిమాల్ని కూడా దాటుకుంటూ వచ్చేసింది. 2.47 మిలియన్ డాలర్లతో అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఎనిమిదో స్థానంలో ఉన్న‘ఖైదీ నంబర్ 150’ని, 2.49 మిలియన్ డాలర్లతో ఏడో స్థానంలో ఉన్న ‘అఆ’ను కూడా ‘మహానటి’ దాటేసింది.

ఇప్పటిదాకా అమెరికాలో 2.5 మిలియన్ మార్కును ఆరు సినిమాలు మాత్రమే దాటాయి. అందులో ‘బాహుబలి-2’, ‘బాహుబలి-1’ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇటీవలే 3.5 మిలియన్ డాలర్లతో ‘రంగస్థలం’ మూడో స్థానానికి చేరగా.. 3.3 మిలియన్ డాలర్లతో వెనుకే నాలుగో స్థానంలో ఉంది ‘భరత్ అనే నేను’. మహేష్ సినిమానే అయిన ‘శ్రీమంతుడు’ 2.87 మిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ‘మహానటి’ దాన్ని దాటడం కష్టమే కావచ్చు. ఆరో స్థానానికి ఫిక్స్ కావాల్సి రావచ్చు. అలాగని ఇదేమీ చిన్న ఘనత కాదు. పేరున్న దర్శకుడు.. పేరున్న హీరోయిన్ లేకపోయినా ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఈ స్థానంలో నిలవడం అసాధారణమైన విషయం. ఫుల్ రన్లో ఈ చిత్రం అక్కడ 2.7 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసే అవకాశముంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు