బడా స్టార్ దగ్గర పిఆర్వో పోస్టు కోసం రచ్చ

బడా స్టార్ దగ్గర పిఆర్వో పోస్టు కోసం రచ్చ

టాలీవుడ్ లో ఆ ఫ్యామిలీది చాలా పెద్ద రేంజ్. ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ మంది హీరోలు ఉండడం మన దగ్గర కామన్ అయిపోయింది కానీ.. ఇంతమంది స్టార్లుగా ఎదగడం మాత్రం ఆ కుటుంబం నుంచే నేర్చుకోవాలి. ఆ క్యాంప్ లో కొంతమందికి స్వంతంగా ప్రొడక్షన్ కంపెనీలు కూడా ఉన్నాయి.

ఆ కుటుంబ వారసుడయిన ఓ స్టార్ హీరో.. ఈ మధ్యనే తన ప్రొడక్షన్ కంపెనీలో పెద్ద హిట్ కొట్టాడు. మరో పెద్ద సినిమా కూడా లైన్ లో పెట్టాడు. అయితే.. ఈ స్టార్ హీరో ప్రారంభించిన ప్రొడక్షన్ కంపెనీలో ఇప్పుడు పీఆర్ఓ పోస్టు ఖాళీ అయింది. ఇందుకు కారణం.. కొంతకాలంగా ఆ విధులు నిర్వహిస్తున్న ఒక పర్సన్ మానేసి వెళ్ళిపోవడమే. ఇలా మానేయడానికి ఆ వ్యక్తి వ్యక్తిగత కారణాలు మాత్రమే కారణం తప్ప.. ప్రొడక్షన్ హౌస్ తో తేడాలు ఏం లేవు లెండి. అయితే.. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. ఆ పోస్టు కోసం చాలామంది సీనియర్లు తెగ పోటీ పడుతున్నారు.

ఆ కుటుంబం అండ సంపాదిస్తే.. కొన్నేళ్లయినా ఆ ట్యాగ్ పడితే చాలు.. ఇక లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అనే హిస్టరీ ఉండడంతో.. ఈ పోస్టుకు విపరీతమైన పోటీ కనిపిస్తోంది. కొందరు కులం కార్డు వాడితే.. కొందరు తమకు డిజిటిల్ మీడియాలో ఉన్న బలం చూపిస్తున్నారు. ఇంతకీ సదరు స్టార్ హీరో ఏం నిర్ణయం తీసుకుంటాడా అని ఫిలిం మీడియా తెగ ఉత్కంఠగా చూస్తోంది. ఆ అదృష్టం ఎవరిని వరించనుందో అన్నదే ఇక్కడ మిగిలిన వారికి ఆసక్తి కలిగించే పాయింట్. కాని ఆ పోస్టు కోసం ఇప్పుడు భారీ స్థాయిలో పాలిటిక్సే జరుగుతున్నాయని ఫిలిం నగర్ టాక్.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు