చరణ్‌ భలే తప్పించుకున్నాడుగా!

చరణ్‌ భలే తప్పించుకున్నాడుగా!

ఒక కథ వినగానే అది హిట్టవుతుందా, పోతుందా అనేది గెస్‌ చేయడంలోనే హీరో సక్సెస్‌ దాగి వుంటుంది. ఏ హీరోకి అయితే బెటర్‌ జడ్జిమెంట్‌ వుంటుందో అతడే టాప్‌లోకి వెళ్లగలుగుతాడు. మొదట్లో హిట్టు కథలని బాగానే పట్టిన చరణ్‌ ఆ తర్వాత తడబడ్డాడు. కొన్ని చెత్త కథలకి ఓకే చెప్పి తన రేంజ్‌ తగ్గించుకున్నాడు. అయితే తప్పుల నుంచి రియలైజ్‌ అయిన చరణ్‌ ఈమధ్య తన జడ్జిమెంట్‌తో విజయాలు అందుకోవడమే కాకుండా పరాజయాలని తప్పించుకుంటున్నాడు.

వరుసగా రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడు మేర్లపాక గాంధీ వెళ్లి చరణ్‌కి 'కృష్ణార్జున యుద్ధం' కథ చెప్పాడు. యువి క్రియేషన్స్‌ ద్వారా వెళ్లిన ఈ కథని చరణ్‌ రిజెక్ట్‌ చేసాడు. నాయక్‌లో ద్విపాత్రాభినయం చేసాను కనుక అలాంటిది ఇంకొకటి ఇప్పుడప్పుడే చేయనని తిరస్కరించాడు. ఆ చిత్రం నానితో తీస్తే ఫలితం ఏమైందో తెలిసిందే. అలాగే రెండు హిట్లు కొట్టిన దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ కూడా చరణ్‌కి 'నేల టికెట్‌' కథ చెప్పాడు. కానీ చరణ్‌ని ఆ కథ ఎక్సయిట్‌ చేయలేదు. చరణ్‌ రిజెక్ట్‌ చేసిన అదే కథని రవితేజ చేసి ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నాడు.

ధృవ చిత్రం రీమేక్‌ కరక్ట్‌ కాదని పలువురు వారించినా చరణ్‌ దానిని నమ్మాడు. విజయాన్ని అందుకున్నాడు. అలాగే సుకుమార్‌కి కమర్షియల్‌ సినిమా తీయడం రాదని, అతనితో ఇప్పుడు చేయడం మంచిది కాదని కొందరు హెచ్చరించినా, చెవిటివాడి పాత్ర అయినా కానీ భయపడకుండా రంగస్థలం చేసి ఘన విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం చరణ్‌ తీసుకుంటోన్న జాగ్రత్తలు, కథలని అంచనా వేస్తోన్న తీరుతో అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English