పూనమ్‌ కౌర్‌ వల్లే త్రివిక్రమ్‌ బయటకొచ్చాడా?

పూనమ్‌ కౌర్‌ వల్లే త్రివిక్రమ్‌ బయటకొచ్చాడా?

అజ్ఞాతవాసి పరాజయం తర్వాత మీడియాకి, పబ్లిక్‌కి మొహం చాటేసిన త్రివిక్రమ్‌ సడన్‌గా ఒక పత్రికకి సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం తన పుట్టినరోజు కానీ, తన చిత్రం రిలీజ్‌ కానీ లేదు. ఎలాంటి సందర్భం లేకుండా త్రివిక్రమ్‌ ఇంటర్వ్యూ ఇవ్వడం, అనేక సున్నితమైన విషయాలని ప్రస్తావించడం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది.

తనపై వచ్చే పుకార్ల గురించి స్పందించని త్రివిక్రమ్‌ తనకి చాలా మంది హీరోయిన్లతో లింకులు పెట్టారనే సంగతి ప్రస్తావించాడు. తన కుటుంబాన్ని లైమ్‌ లైట్‌కి ఎందుకు దూరంగా వుంచుతాడనేది కూడా వివరించాడు. ఎన్నడూ లేనిది త్రివిక్రమ్‌ ఇదంతా ఎందుకు మాట్లాడినట్టు? అది కూడా సందర్భం లేకుండా ఇలా ఎందుకు వివరణ ఇచ్చుకున్నట్టు? రీసెంట్‌గా పూనమ్‌ కౌర్‌ వేస్తోన్న ట్వీట్లు త్రివిక్రమ్‌ గురించేనని రచ్చ జరుగుతోంది.

అతనికి నాలుగు కుటుంబాలున్నాయని, ఎన్నారై అమ్మాయిలంటే పడి చచ్చిపోతాడని పూనమ్‌ ఇన్‌డైరెక్టుగా చెప్పింది. ఆ తర్వాత ఆ మాటలు అన్నది త్రివిక్రమ్‌ గురించేనని అర్థమయ్యేలాను పోస్టులు వేసింది. దీంతో త్రివిక్రమ్‌ పేరుతో మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. దాని గురించి డైరెక్టుగా మాట్లాడకుండా, త్రివిక్రమ్‌ ఇలా స్పందించాడని చెవులు కొరుక్కుంటున్నారు. తనకి చాలా మందితో లింకులు పెట్టారనే త్రివిక్రమ్‌ మాటల పట్ల పూనమ్‌ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English