పెళ్లితో సమంత మార్పేంటో చెప్పిన నాగ్

పెళ్లితో సమంత మార్పేంటో చెప్పిన నాగ్

నాగచైతన్యను పెళ్లాడి అక్కినేని వారి కోడలిగా ఈజీగానే సెటిలైపోయింది సమంత. ఆమె విషయంలో జనాలకు కొత్తగా ఏమీ అనిపించడం లేదు. పెళ్లికి ముందు లాగే సినిమాలు చేసుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తాను చేయాలనుకున్నవన్నీ చేస్తోంది.

పెళ్లి తర్వాత ఆమె కెరీర్ మరింత ఊపందుకుంది కూడా. చైతూతో ముడిపడ్డాక సమంత చేసిన ప్రతి సినిమా ఇరగాడేస్తోంది. నటిగా కూడా ఆమెకు మంచి పేరొస్తోంది. ఇది చూసి తనకు కూడా చాలా సంతోషంగా ఉందని.. సమంత తన కోడలు అని గర్వంగా చెప్పుకుంటున్నానని నాగార్జున చెప్పడం విశేషం. పెళ్లి తర్వాత సమంతలో వచ్చిన ఒకే ఒక మార్పు ఆమె చిరునామాయే అని.. అంతకుమించి ఆమెలో తాను ఏ మార్పూ చూడట్లేదని నాగ్ అన్నాడు.

పెళ్లి తర్వాత సమంత కెరీర్ చూస్తే తనకు చాలా చాలా సంతోషంగా ఉందని.. ‘మెర్శల్’.. ‘రంగస్థలం’.. ‘ఇరుంబుతురై’.. ‘మహానటి’ లాంటి ఘనవిజయాల్లో ఆమె పాలుపంచుకోవడం.. తనకు చాలా మంచి పేరు రావడం పట్ల గర్వంగా ఉందని నాగ్ ఓ ఇంగ్లిష్ డైలీతో ఇంటర్వ్యూలో చెప్పాడు.

 పెళ్లి తర్వాత చాలా వరకు హీరోయిన్ల కెరీర్లు గాడి తప్పుతుంటాయని.. కానీ సమంత విషయంలో అలా జరగలేదని.. దీన్ని బట్టి పెళ్లయిన హీరోయిన్ల విషయంలో గతంలో అందరూ ఎంత పెద్ద తప్పు చేశారో.. ఎంత చెడుగా ఆలోచించారో అర్థం చేసుకోవచ్చని నాగ్ అన్నాడు. ఈ విషయంలో సమంత అందరి ఆలోచనల్నీ మార్చిందని.. ఆమె మున్ముందు కూడా ఇలాగే మంచి సినిమాలు చేస్తూ సాగిపోవాలని కోరుకుంటున్నానని నాగ్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు