ఈ సినిమా పోతే.. ఆయన్ని పొగుడుతున్నారు

ఈ సినిమా పోతే.. ఆయన్ని పొగుడుతున్నారు

మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ‘నేల టిక్కెట్టు’ ఫలితమేంటో తొలి రోజు తొలి ఆటతోనే తేలిపోయింది. విడుదలకు ముందే ఈ చిత్రానికి బజ్ అంతంతమాత్రంగా ఉంది. రవితేజ కెరీర్లో ఏ సినిమాకూ లేని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ డల్లుగా కనిపించాయి. ఓపెనింగ్స్ కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి.

ఇక మార్నింగ్ షోతోనే బ్యాడ్ టాక్ రావడంతో సినిమా పుంజుకునే అవకాశాలు లేకపోయాయి. రవితేజ గతంలోనూ ఇలాంటి డిజాస్టర్లు చాలానే ఇచ్చాడు. మాస్ మాస్ అని జపం చేసి దారుణమైన ఫలితాలు ఖాతాలో వేసుకున్నాడు. మూడు నెలల కిందటే ‘టచ్ చేసి చూడు’ లాంటి సినిమాతో పలకరించాడు కాబట్టి ఇప్పుడతను ‘నేల టిక్కెట్టు’ లాంటి సినిమాలో నటించడం ఎవరికీ ఆశ్చర్యంగా అనిపించడం లేదు.

కానీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి బ్లాక్ బస్టర్‌తో పరిచయమై, ఆ తర్వాత ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన కళ్యాణ్ కృష్ణ ఇలాంటి చిత్రం తీయడమేంటన్నదే అర్థం కావడం లేదు. ఈ సందర్భంగా ‘సోగ్గాడే..’, ‘రారండోయ్..’ సినిమాలకు రీషూట్లు జరగడం.. ఎడిటింగ్ దశలో మార్పులు చేర్పులు జరగడం గురించి అప్పట్లో వచ్చిన వార్తలు అందరికీ గుర్తుకొస్తున్నాయి. ఆ సినిమాల ఔట్ పుట్ విషయంలో నాగ్ సంతృప్తి చెందక వేరే రైటర్ల సాయం తీసుకుని మార్పులు చేర్పులు చేయించడం బహిరంగ రహస్యమే.
ఇప్పుడు కళ్యాణ్ బయటి బేనర్లో ‘నేల టిక్కెట్టు’ లాంటి పేలవమైన సినిమా అందించేసరికి.. అతడి తొలి రెండు సినిమాలు విజయవంతం కావండంలో నాగ్ పాత్రే కీలకమన్న అభిప్రాయం బలపడుతోంది. మొత్తానికి ‘నేల టిక్కెట్టు’ ఫలితం చూశాక అందరూ ఎంతైనా నాగార్జున నాగార్జునే అంటూ ఆయన్ని పొగుడుతుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు