ఆమె సెక్సీ వీడియో తీసింది వాళ్ళాయనే

ఆమె సెక్సీ వీడియో తీసింది వాళ్ళాయనే

ఇప్పుడు జనాలకు ఫిట్నెస్ మీద బాగా అవగాహన పెరుగుతోంది. ఇలా పెంచడానికి సెలబ్రిటీలు కూడా గట్టిగానే ట్రై చేస్తున్నారు. అవతలి వాళ్లకు చెప్పాలంటే.. ముందు వాళ్లు ఫిట్ గా ఉండాలి కాబట్టి.. జిమ్ లో గంటల తరబడి గడిపేసి.. బాడీని పర్ఫెక్టుగా మెయింటెయిన్ చేస్తున్నారు. జిమ్ లో తాము ఎంతగా శ్రమిస్తామో చూపే వీడియోలను కూడా నెట్ లో పోస్ట్ చేస్తున్నారు.

రీసెంట్ గా ఓ హీరోయిన్ కూడా ఇలాంటి వీడియోనే నెట్ లో పెట్టింది. ఏ మాటకు ఆ మాటే కానీ.. పెళ్లయినా సరే.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ చూసి.. యంగ్ హీరోయిన్లు కూడా భయపడాల్సిందే. అయితే.. ఈ వీడియో విషయంలో బాగానే విమర్శలు వస్తున్నాయి. పెళ్ళయిన హీరోయిన్ ఏంటీ.. ఇలాంటి బట్టలేసుకుని పోస్టులేంటి.. అంటూ చాలామంది తెలుగోళ్ళు ఆన్ లైన్ లో తెగ ఫీలయిపోతున్నారు. అసలు స్పోర్ట్ప్ బ్రా వేసుకుని.. అంత ఎక్సపోజింగ్ ఏంటి.. అవతల మంచు లక్ష్మి చూడండి ఎంత హుందాగా కనిపించిందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ముందంటే ఆన్ లైన్ వ్యవహారాలు కాస్త ఖరీదుగా ఉండేవి కాబట్టి.. ఇలాంటి అభిప్రాయాలు తక్కువగానే వినిపించేవి. ఇప్పుడు రోజుకు ఐదు రూపాయల ఖర్చు చేస్తే చాలు.. ఎవరినైనా ఎంతసేపయినా.. ఎన్ని సార్లయినా విపరీతంగా వేధించే అవకాశాన్ని టెలికాం కంపెనీలు ఉచిత 4జి ఇంటర్నెట్ ద్వారా కల్పించాయి. వాళ్లు ఇచ్చినది వేరే ఉద్దేశ్యం అయినా.. చాలామంది ఇందుకే వాడుతున్నారు లెండి.

ఇక పాయింట్ కి వచ్చేస్తే.. ఇప్పుడు ఆ పెళ్లయిన హీరోయిన్ అలాంటి బట్టలతో వర్కవుట్స్ చేస్తున్నపుడు.. చూసిన.. వీడియో తీసిన వ్యక్తి ఎవరో కాదట. స్వయంగా ఆమె భర్తే ఆ వీడియో తీశాడని తెలుస్తోంది. వాళ్ళింట్లో ఉన్న జిమ్ లో అలా వర్కవుట్ చేసి.. ఆ భామ అలా పోస్ట్ చేసింది. ఇప్పుడు చెప్పండి ట్రాలింగ్ బాబులూ.. కందకు లేని అదేదో ఇది కత్తికి ఎందుకు అని.. వాళ్ళాయనే చక్కగా ఎంకరేజ్ చేస్తుంటే.. మీకెందుకు ఈ రచ్చంతా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు