షూటింగ్ అంటూ సమంత డుమ్మా

షూటింగ్ అంటూ సమంత డుమ్మా

పొగడ్తలు ప్రశంసలు అంటే ఎవరికైనా ఇష్టమే. అదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా సత్కారం అంటే.. ఎవరైనా ఉత్సాహం చూపిస్తారు. అరుదుగా లభించే ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోరు. ముఖ్యంగా నటీనటులు ఇలాంటివాటిపై మరీ ఆసక్తి చూపుతారు. మహానటి మూవీ యూనిట్ కు.. అనేక మంది సినిమా.. సినిమాయేతర ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహానటి టీం మొత్తాన్ని సత్కరించారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ దాదాపు అందరికీ ఆహ్వానాలు అందాయి. వీలు చిక్కినంత వరకూ అందరూ వచ్చారు కానీ.. ఒక్క టాలీవుడ్ బ్యూటీ సమంత మాత్రం డుమ్మా కొట్టేసింది. ఈ సత్కార కార్యక్రమానికి రావాలంటూ సమంతను ముందుగానే ఆహ్వానించారట. అయితే.. ఆమె మాత్రం తనకు షూటింగ్ ఉందని చెప్పి.. మిన్నకుండి పోయిందనే టాక్ వినిపిస్తోంది. మహానటి సక్సెస్ లో సమంత వాటా ఉంది.

అయితే.. సినిమా సక్సెస్ తర్వాత ఎందుకో సామ్ మాత్రం కాసింత దూరం దూరం అన్నట్లుగా ఉంటోంది. ప్రచారం విషయంలో లోటేమీ చేయకపోయినా.. ఇప్పుడు మాత్రం సత్కారం దగ్గరకు వచ్చేసరికి పక్కకు తప్పుకుంది. ఇలా చంద్రబాబు లాంటి వ్యక్తి నుంచి పొందే గౌరవాన్ని సామ్ ఎందుకు వద్దని అనుకుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు