ఆపరేషన్ సక్సెస్ అవుతుందా?

ఆపరేషన్ సక్సెస్ అవుతుందా?

టాలీవుడ్ లో హీరోలు వేరే తరహా పాత్రలకు షిఫ్ట్ అయితే.. మళ్లీ లీడ్ రోల్స్ దొరకడం చాలా కష్టం. కానీ విచిత్రంగా శ్రీకాంత్ కు మాత్రం భలే ఆఫర్స్ వస్తున్నాయి. గోవిందుడు అందరివాడేలే మూవీలో హీరో బాబాయ్ గా క్యారెక్టర్ పాత్రలో నటించాడు. రీసెంట్ గా విలన్ గా కూడా కనిపించాడు. అయినా సరే ఇంకా హీరో రోల్స్ ను కూడా అందుకుంటూ షాక్ కు గురి చేస్తున్నాడు శ్రీకాంత్.

ఇప్పుడు శ్రీకాంత్ హీరోగా రూపొందిన ఆపరేషన్ 2019 మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది. గతంలో వచ్చిన ఆపరేషన్ ధుర్యోధన.. శ్రీకాంత్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచి.. హీరోగా అతడి కెరీర్ ను కంటిన్యూ చేసింది. ఇప్పుడు మళ్లీ దాదాపు అదే తరహా థీమ్ ను ఇవాల్టి జనరేషన్ కు అనుగుణంగా రూపొందించాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయగా.. బాగానే ఆసక్తి కలిగించింది. ప్రజలతో జాగ్రత్త అంటూ పెట్టిన ట్యాగ్ లైన్ వెరైటీగా ఉందని చెప్పాలి.

ఆపరేషన్ 2019లో శ్రీకాంత్.. ఓ పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నాడు. ప్రస్తుత రాజకీయాలను బేస్ చేసుకుని.. సినిమాలో బాగానే పంచ్ డైలాగ్స్ ఉంటాయట. ఈ మూవీ క్లిక్ అయితే మాత్రమే శ్రీకాంత్ కు హీరోగా కంటిన్యూ అయేందుకు అవకాశం చిక్కుతుంది. మరి ఈ ఆపరేషన్ ను సీనియర్ హీరో ఏ మేరకు సక్సెస్ తీరాన్ని చేర్చుతాడో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు