చుట్టూ రొటీన్.. మధ్యలో మాస్ రాజా

చుట్టూ రొటీన్.. మధ్యలో మాస్ రాజా

చుట్టారా జనం.. మధ్యలో మనం.. ఇదీ నేల టికెట్ లో రవితేజ చెప్పిన డైలాగ్. సినిమా కూడా ఇందుకు తగినట్లుగానే సాగుతుంది. అయితే.. సినిమా చూడడం ప్రారంభించిన కాసేపటికే మళ్లీ రొటీన్ మాస్ మూవీ అనే సంగతి అర్ధం అయిపోతుంది.

ఇది చూసిన తర్వాత జనాలకు అర్ధమయ్యే పాయింట్ ఒకటే.. రవితేజ చుట్టూరా ఉన్న జనం ఒకే మాదిరిగా ఉంటున్నారని అనిపించక మానదు. కిక్2 తో డిజాస్టర్ ఎదుర్కున్న రవితేజ.. బెంగాల్ టైగర్ అంటూ తన స్టైల్ మాస్ మూవీతోనే అలరించాడు. అందాల భామలు.. ఫార్ములా పాటలు.. రవితేజ మార్క్ డైలాగులు.. కంటెంట్ ఇదే అయినా.. సినిమా పాసయిపోయింది. ఆ తర్వాత ఏడాదిన్నరకి పైగా రవితేజ నుంచి సినిమా రాలేదు. మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం కోసం అనిల్ రావిపూడి సినిమా రాజా ది గ్రేట్ కూడా రొటీన్ సినిమానే అయినా.. అంధుడి పాత్రతో చేయించిన కామెడీ.. ఈ సినిమాను సక్సెస్ చేసింది.

ఇక రవితేజ గత చిత్రం టచ్ చేసి చూడు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మళ్లీ అదే ఫార్ములా.. అదే స్టైల్. ఈ మూవీ ఫలితం గురించి రవితేజకు ముందే తెలుసు. అందుకే పెద్దగా ప్రచారమే చేయలేదు. ఇప్పుడు నేల టికెట్ విషయంలో రవితేజ దాదాపుగా ఇదే ఫార్మాట్ అవలంబించాడు. ముందునుంచే ఎలాంటి అంచనాలను సృష్టించలేకపోయిన ఈ చిత్రం.. రవితేజ కెరీర్ లో మరోసారి మాస్ ఫార్ములా మూవీ అనిపించుకోవడానికి తప్ప.. మరెందుకు ఉపయోగపడేట్లుగా లేదు. ఇక ముందు అయినా.. మాస్ మహరాజ్ నుంచి వేరే టైపు కంటెంట్ సినిమాలొస్తాయో.. లేక మళ్లీ అవే జనం.. మధ్యలో మనం అనుకుంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English