తెలుగు సెలబ్రిటీల ఫిట్నెస్ చూశారా..

తెలుగు సెలబ్రిటీల ఫిట్నెస్ చూశారా..

బాలీవుడ్ తో  పోల్చితే సౌత్ లో హీరో హీరోయిన్లకు ఫిట్నెస్ విషయంలో శ్రద్ధ తక్కువ అనే మాటలు గతంలో బాగా వినిపించేవి. ఇప్పుడు కూడా కొంతమేరకు సిట్యుయేషన్ ఇలాగే ఉన్నా.. కొందరు మాత్రం తాము విభిన్నం అని నిరూపించుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మన టాలీవుడ్ లో కూడా ఫిట్నెస్ పై బాగానే శ్రద్ధ పెరిగింది. ప్రస్తుతం దేశమంతటా స్పోర్ట్స్ శాఖా మంత్రి రాజవర్దన్ రాథోడ్ విసిరిన #FitnessChallenge పుణ్యమా అంటూ మన సెలబ్రిటీలు అందరూ తమ ఫిట్నెస్ వీడియోలను సోషల్ మాద్యమాల్లో తెగ పోస్ట్ చేస్తున్నారు. పదండి ఓసారి చూద్దాం.

సిక్స్ ప్యాకులు చేయడం వంటివి కూడా మనోళ్లకు కామన్ అయిపోయింది. అంతే కాదు.. గంటలకొద్దీ వర్కవుట్స్ చేస్తూ అందాల భామలు కూడా అలరిస్తున్నారు. సొంతంగా జిమ్ ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ ఫిట్నెస్ పాటిస్తూనే ఉంటుంది. నాగ చైతన్య.. అఖిల్ లాంటి హీరోలు కూడా దేహధారుడ్యం పై బాగానే దృష్టి పెట్టారు. గభాలున చూస్తే.. మన హీరోలేనా అనిపించే రేంజ్ లో మారిపోతున్నారు. రామ్ చరణ్ కూడా ధృవ టైంలోనే ఫిట్నెస్ సత్తా చాటాడు. యంగ్ హీరోల్లో కొందరు ఫిజికల్ గా ఫిట్ గా ఉండడంపై బాగానే కాన్సంట్రేట్ చేశారు.

స్పోర్ట్స్ స్టార్ మిథాలీ రాజ్ కూడా తెలుగు సెలబ్రిటీనే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈమె కూడా ఎప్పుడు చూసినా ఫిట్ గానే కనిపిస్తుంది. సమంత కూడా తెగ వర్కవుట్స్ చేస్తూ ఉంటుంది. అసలు టాలీవుడ్ కి సిక్స్ ప్యాక్ ను పరిచయం చేసిన దేశముదురు అల్లు అర్జున్ ను గుర్తు చేసుకోకపోతే.. ఈ ఆర్టికల్ సంపూర్తి అనిపించదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు